తెలంగాణలో ఉద్యోగాల (TS Govt Jobs) పర్వం కొనసాగుతోంది. 80 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ (CM KCR) అసెంబ్లీలో ప్రకటించిన విధంగా ఉద్యోగాల భర్తీ కొనసాగుతోంది. వరుసగా జాబ్ నోటిఫికేషన్లు (Telangana Job Notifications) విడుదల అవుతుండడంతో నిరుద్యోగ యువకులు ఉత్సాహంతో ప్రిపరేషన్ ను పరుగులు పెట్టిస్తున్నారు. అత్యధిక మంది నిరుద్యోగులు పోటీ పడే పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల కావడంతో పాటు మొదటి దశ ఎంపిక సైతం ముగిసింది. ఈ నెల 8వ తేదీ నుంచి రెండో దశ అయిన.. ఈవెంట్స్ ప్రక్రియ ప్రారంభం కానుంది. గ్రూప్-1 (TSPSC Group-1) ఉద్యోగాలకు సంబంధించి సైతం ప్రిలిమ్స్ పూర్తి కావడంతో ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. దీంతో పాటు ఇటీవల 9 వేలకు పైగా భారీ ఖాళీలతో గ్రూప్-4 నోటిఫికేషన్ కూడా విడుదలైంది. దీంతో లక్షలాది మంది అభ్యర్థులు పుస్తకాలు చేతబట్టి ప్రపరేషన్ లో మునిగిపోయారు.
అయితే.. నెక్ట్స్ వచ్చే నోటిఫికేషన్ ఏంటి అన్న అంశంపై నిరుద్యోగ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అయితే.. తర్వాత వచ్చే నోటిఫకేషన్ లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురు చూస్తోన్న టీచర్ ఉద్యోగాలకు సంబంధించినదేనని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నెలలోనే ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ వస్తుందని సమాచారం. గురుకులాల్లో టీచర్ ఉద్యోగాల భర్తీకి (Gurukul Teacher Jobs) నోటిఫికేషన్ విడుదలకు సంబంధిత బోర్డు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే 9 వేల ఖాళీలకు అనుమతులు రాగా.. ఈ వారంలో మరో 3 వేల ఖాళీల భర్తీకి అనుమతులు వస్తాయని అధికారులు చెబుతున్నారు.
అనుమతుల వచ్చిన వెంటనే మొత్తం 12 వేల ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల మూడో వారంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. మంత్రి కేటీఆర్ (KTR) సైతం గురుకుల విద్యాసంస్థల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను అతి త్వరలో విడుదల చేయబోతున్నామని నిన్న నిరుద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయా ఉద్యోగాలే లక్ష్యంగా ఎదురు చూస్తున్న అభ్యర్థులు ఇక ప్రిపరేషన్ ను ప్రారంభిస్తే బెటర్. అభ్యర్థులకు ఆల్ ది బెస్ట్..
TS npdcl jlm notification eapdu vastundi sir
TS npdcl jlm notification eapdu vastundi sir
TS npdcl jlm notification eapdu vastundi sir
TS npdcl jlm notification eapdu vastundi sir