తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ ను రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ రిలీజ్ చేసింది. మొత్తం మూడు విడతల్లో ప్రవేశాల ప్రక్రియ జరగుతుంది. ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశమైన కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభానికి ముందే ఎస్ఎస్సీ , ఇంటర్ మార్కుల మెమోలు,టీసీ, ఇన్ కమ్ , క్యాస్ట్ సర్టిఫికెట్లను సిద్ధం చేసుకోవాలని కమిటీ సూచించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం టీజీఈఏపీసెట్ వెబ్ సైట్ ను సందర్శించాలని తెలిపింది.
కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇదే:
-జూన్ 27 నుంచి ఇంజనీరింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
-జూన్ 30 నుంచి మొదటి విడత వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు.
-జులై 12న మొదటి విడత ఇంటనీరింగ్ సీట్ల కేటాయింపు ఉంటుంది.
-జులై 19 ఇంజనీరింగ్ రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభం
-జులై 24న ఇంజనీరింగ్ రెండో విడత సీట్ల కేటాయింపు
-జులై 30 నుంచి ఇంజనీరింగ్ తుది విడత కౌన్సెలింగ్ ప్రారంభం.
-ఆగస్టు 5 న చివరి విడత ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు
-ఇంటర్నల్ స్లైడింగ్ ఆన్ లైన్లో కన్వీనర్ ద్వారా చేపట్టాలని నిర్ణయించారు.
-ఆగస్టు 12 నుంచి ఇంటర్నల్ స్లైడింగ్ ప్రక్రియ ఉంటుంది.
-ఆగస్టు 16న ఇంటర్నల్ స్టైడింగ్ సీట్ల కేటాయింపు ఉంటుంది.
-ఆగస్టు 17న స్పాట్ ఆడ్మిషన్లకు మార్గదర్శకాలను రిలీజ్ చేస్తారు.