తెలంగాణ విద్యామండలి కొత్త షెడ్యూలు రెడీ అయింది. ఇప్పటికే పాలీసెట్, ఈసెట్, ఎంసెట్ ఎగ్జామ్ తేదీలు వెల్లడయ్యాయి. కొత్తగా మరిన్ని సెట్ల తేదీల ప్రాథమిక షెడ్యూలు ఖరారైంది. హైకోర్టు కేసు విచారణ పూర్తి కాగానే అధికారికంగా వీటిని ప్రకటించే అవకాశాలున్నాయి. కొత్త షెడ్యూలు ప్రకారం టీఎస్ ఎడ్ సెట్ అక్టోబర్ 1, 3 తేదీల్లో, లా సెట్ అక్టోబర్ 4 న నిర్వహిస్తారు. సెప్టెంబర్ 21 , 22 తేదీల్లో తెలంగాణ ఎంసెట్ (అగ్రికల్చర్) ఎంట్రన్స్ జరుగుతుంది.
తాజాగా ఖరారైన షెడ్యూల్ ప్రకారం..
Advertisement
- ఆగస్టు 31న ఈసెట్.
- సెప్టెంబర్ 2న పాలిసెట్.
- సెప్టెంబర్ 9, 10, 11, 14వ తేదీలలో ఎంసెట్ (ఇంజనీరింగ్)
- సెప్టెంబర్ 21, 22వ తేదీలలో ఎంసెట్ (అగ్రికల్చర్)
- అక్టోబర్ 1, 3 తేదీల్లో ఎడ్ సెట్
- అక్టోబర్ 4న లాసెట్
- సెప్టెంబర్ 21 నుంచి 24 వరకు పీజీసెట్
