టీఎస్ ఎడ్‌సెట్-2021 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 19 నుంచి జూన్ 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఆగస్టు 24, 25 తేదీల్లో ఎడ్‌సెట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ ఏడాది అన్ని మెథడాలజీలకు ఒకే ప్రశ్నాపత్రం ఉంటుందని ఎడ్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రామకృష్ణ వెల్లడించారు. ఎడ్‌సెట్ వెబ్‌సైట్‌లో సిలబస్, నమూనా ప్రశ్నాపత్రం అందుబాటులో ఉంది.

బీఈడీ కోర్సులో పలు మార్పులుచేస్తూ విద్యాశాఖ స్పెషల్‌సీఎస్ చిత్రారామచంద్రన్ ఇప్పటికే జీవో జారీ చేసింది. అందులో ఉన్న వివరాలివి..
బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎంట్రెన్స్, అడ్మిషన్స్ విధానం లో మార్పులు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి మార్గదర్శకాల మేరకు ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. ఎడ్సెట్ కి సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ విడుదల అయింది… అర్హత కి సంబంధించి రూల్స్ లో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. దీంతో ఒకటి రెండు రోజుల్లో ఎడ్ సెట్ నోటిఫికేషన్ కూడా విడుదల కానుంది…
ఆగస్ట్ 24,25 తేదీల్లో ఎంట్రెన్స్ టెస్ట్ జరపాలని ఇప్పటికే ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది.
కొత్త ఉత్తర్వుల ప్రకారం.. ఇప్పటినుంచి డిగ్రీలో కోర్సుల వారీగా కాకుండా అన్ని గ్రూపులకు ఒకటే ఎడ్సెట్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. నిర్వహించనుంది.
పరీక్ష పాటర్న్ విషయానికి వస్తే మొత్తం 150 మార్క్ లకు ఎంట్రెన్స్ టెస్ట్ ఉంటుంది… ఇందులో సబ్జెక్టు కు 60 మార్కులు ఉంటాయి. సైన్స్ కి 20 మార్క్స్, సోషల్ కి 20 మార్క్స్, మాథ్స్ కి 20 మార్క్స్ ఉంటాయి. సబ్జెక్టు సంబంధించిన ప్రశ్నలు 10 వ తరగతి అంత లోపు తరగతుల సిలబస్ నుండి మాత్రమే ఉంటాయి. టీచింగ్ ఆప్టిట్యూడ్ కి 20 మార్క్స్, కంప్యూటర్ అవేర్ నెస్ కి 20మార్క్స్,జనరల్ నాలెడ్జి , విద్యా అంశాలు 30 మార్క్స్ ,జనరల్ ఇంగ్లీషు 20 మార్క్స్ ఉంటాయి..
పరీక్ష సమయం రెండు గంటలు.
ఇంటర్, డిగ్రీ లో చేసిన గ్రూప్ , ఎడ్సెట్ లో వచ్చిన ర్యాంక్ ప్రాతిపదికన వారికి బీఎడ్ లో ఆయా మెథడాలజీలలో సీట్ల కేటాయింపు ఉంటుంది.
బీఎడ్ కోర్సుల్లో ఎలిజిబిలిటీ క్రైటిరియా లో మార్పులు చేసింది. ఇప్పటి వరకు డిగ్రీ లో చేసిన కోర్సు ని బట్టి అడ్మిషన్స్ అనే విధానం కాకుండా ఇంటర్ లో చేసిన గ్రూప్ ని బట్టి కూడా అడ్మిషన్స్ ఇవ్వాలని నిర్ణయించింది
డిగ్రీ లో ఏ గ్రూప్ చేసిన 50 శాతం మార్క్ లతో పాస్ అయి ఉండాలి… ఇక ఇంజనీరింగ్ లో ఇప్పటి 55 శాతం ఉన్న దాన్ని 50 శాతం మార్కులకు తగ్గించింది.
బీసీఏ చేసిన వారికి ఇంటర్ లో చదివిన సబ్జెక్టు ల మేరకు సంబంధిత మేథోడాలజీ లో చేరే అవకాశం ఉంది.
బీబీఏ చేసిన వాళ్లూ బీఈడీ సోషల్‌స్టడీస్ మెథడ్‌లో ప్రవేశాలు పొందొచ్చు…
కెమిస్ట్రీ ఒక్కటే చదివినా ఫిజికల్ సైన్స్ మెథడాలజీలో బీఎడ్ ప్రవేశం పొందొచ్చు. ఫిజిక్స్, కెమిస్ట్రీ కాంబినేషన్‌తో డిగ్రీ చదివిన వారికి మాత్రమే ఇప్పటివరకు బీఈడీ భౌతికశాస్త్రం మెథడ్‌లో ప్రవేశాలు కల్పించేది. ఇప్పుడు డిగ్రీలో కెమిస్ట్రీ ఒక్క సబ్జెక్ట్ చదివినా భౌతికశాస్త్రం మెథడ్‌గా తీసుకోవచ్చు. ఇటీవల భౌతికశాస్త్రం లేకుండా పలు కాంబినేషన్లతో కొత్త డిగ్రీ కోర్సులు అందుబాటులోకి వచ్చినందున ఈ నిర్ణయం తీసుకుంది.
బీఎస్సీ కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్స్, బీఎస్సీ బాటనీ-జువాలజీ, కెమిస్ట్రీ తదితర 46 కోర్సు ల విద్యార్థులు కూడా బీఈడీలో ఫిజిక్స్ మెథడ్‌లో చేరవచ్చు.
బీఎడ్ కళాశాలల్లో ఏ మెథడాలజీకి ఎంత శాతం సీట్లు అనే దాని పై ఉత్తర్వుల్లో స్పష్టత నిచ్చింది. మ్యాథ్స్‌కు 25 శాతం సీట్లు.. బయోలాజికల్ సైన్స్ ,పిజికల్ సైన్సు కు కలిపి 30 శాతం సీట్లు.. సోషల్ సైన్స్,ఇంగ్లీషు, ఒరియెంటెల్ లాంగ్వేజ్ లకు కల్పి 45 శాతం సీట్లను కేటాయించింది.