తెలంగాణ ఎంసెట్ (TS EAMCET 2022) రిజల్ట్స్ విడుదలయ్యాయి. మంత్రి సబితా ఇంద్రారెడ్డి జేఎన్టీయూలో ఈ ఫలితాలను విడుదల చేశారు. టాప్ ర్యాంకర్ల జాబితాను రిలీజ్ చేశారు. ఎంసెట్ ఇంజినీరింగ్ లో 80.42 శాతం మంది విద్యార్థులు, అగ్రికల్చర్ లో 88.34 శాతం మంది క్వాలిఫై అయ్యారు.
ర్యాంకుల వివరాలన్నీ ఎంసెట్ అఫిషియల్ వెబ్సైట్ లో అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ హాల్టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఎంసెట్ మార్కులతో పాటు తమకు వచ్చిన ర్యాంకుల వివరాలను తెలుసుకోవచ్చు. డైరెక్ట్ లింక్ ఇక్కడ అందుబాటులో ఉంది. జులై 18 నుంచి 21 వరకు ఇంజనీరింగ్. జులై 30, 31 తేదీల్లో అగ్రికల్చర్ ఫార్మా ఎంసెట్ పరీక్షలు జరిగాయి. ఇంజనీరింగ్ కోర్సులకు 1.56 లక్షల మంది, అగ్రికల్చర్, ఫార్మా కోర్సులకు 80,575 మంది విద్యార్థులు అటెండయ్యారు.
ఎంసెట్ రిజల్ట్స్ అఫిషియల్ వెబ్సైట్ eamcet.tsche.ac.in.
రిజల్ట్ కు సంబంధించిన డైరెక్ట్ లింక్ ఇక్కడ అందుబాటులో ఉంది. రిజల్ట్ వెలువడగానే కింద లింక్ అప్డేట్ అవుతుంది.