తెలంగాణలో ఎంసెట్, ఈ సెట్ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన తేదీలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఎంసెట్ పరీక్షను జూలై 14, 15, 18, 19, 20 తేదీల్లో
నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ఈసెట్
పరీక్షను జూలై 18వ తేదీన నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
రాష్ట్రంలోని వివిధ ప్రవేశ పరీక్షలకు సంబంధించి
రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రితో పాటు
ఇతర అధికారులతో మంత్రి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ పరీక్షలను 28 రీజనల్ సెంటర్స్ పరిధిలోని 105 పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తారని మంత్రి తెలిపారు. ఎంసెట్‌లో అగ్రికల్చర్‌కు సంబంధించి జులై 14,15 తేదీల్లో, ఇంజనీరింగ్‌కు సంబంధించి జులై 18, 19, 20 తేదీల్లో జరుగుతాయి.
జులై 14,15, 18,19,20 తేదీల్లో ఎంసెట్.. 13న ఈసెట్
RELATED ARTICLES
PRACTICE TEST
CURRENT AFFAIRS