HomeFeaturedEAMCETఎంసెట్​కు రికార్డు దరఖాస్తులు.. అప్లై చేయకుంటే ఇంకా ఛాన్స్​ ఉంది

ఎంసెట్​కు రికార్డు దరఖాస్తులు.. అప్లై చేయకుంటే ఇంకా ఛాన్స్​ ఉంది

తెలంగాణలో ఎంసెట్​కు (TS EAMCET 2023) రికార్డు స్థాయిలో దరఖాస్తులు నమోదయ్యాయి. ఇప్పటికే ఎంసెట్​ అప్లికేషన్లు మూడు లక్షలు దాటినట్లు ఎంసెట్​ కన్వీనర్​ తెలిపారు. సోమవారం సాయంత్రం వరకు 3,05,185 మంది విద్యార్థులు ఎంసెట్​కు దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో 1,95,515 ఇంజనీరింగ్​ అప్లికేషన్లు కాగా 1,08,457 అగ్రికల్చర్​ దరఖాస్తులున్నాయి.

Advertisement

ఈ ఏడాది ఎంసెట్​ ఇంజినీరింగ్‌ విభాగానికి సంబంధించిన పరీక్షలను మే 12, 13, 14 తేదీల్లో నిర్వహించనున్నట్లు అధికారులు ఇటీవలే ప్రకటించారు. మే 10, 11 తేదీల్లో ఎంసెట్‌ అగ్రికల్చర్‌ పరీక్షను నిర్వహించనున్నారు.

మార్చి 3 నుంచి ఎంసెట్​ అప్లికేషన్ల ప్రక్రియ మొదలైంది. ఏప్రిల్‌ 4 వరకు అప్లికేషన్ల గడువు ముగిసింది. ఇప్పటికే అప్లై చేయని విద్యార్థులు లేట్​ ఫీజు చెల్లించి మే 2 వ తేదీ వరకు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. ఏప్రిల్‌ 30 నుంచి ఎంసెట్‌ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని కన్వీనర్​ తెలిపారు. ఈసారి ఎంసెట్​కు ఇంటర్​ మార్కుల వెయిటేజీ ఎత్తివేశారు. ఎంసెట్​ ఎంట్రన్స్​లో వచ్చే మార్కుల ఆధారంగా ఇంజనీరింగ్​ అడ్మిషన్లు చేపడుతారు. బీఎస్సీ నర్సింగ్​ అడ్మిషన్లు కూడా ఈసారి ఎంసెట్​ ద్వారానే చేపడుతారు.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!