HomeFeaturedEAMCETటీఎస్​ ఎంసెట్ 2023 షెడ్యూల్.. వచ్చే వారం నుంచి అప్లికేషన్లు​

టీఎస్​ ఎంసెట్ 2023 షెడ్యూల్.. వచ్చే వారం నుంచి అప్లికేషన్లు​

తెలంగాణ ఎంసెట్‌ (TS EAMCET 2023) షెడ్యూల్‌ విడుదలైంది. మే 7 నుంచి 11 వరకు ఎంసెట్​ పరీక్షలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి ప్రకటించారు. ఈనెల 28న ఎంసెట్​ నోటిఫికేషన్‌ వెలువడుతుంది. మార్చి 3 నుంచి ఏప్రిల్‌ 4 వరకు అప్లికేషన్లు స్వీకరించనున్నారు. లేట్​ ఫీజు చెల్లించి మే 2 వ తేదీ వరకు ఎంసెట్‌ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏప్రిల్‌ 30 నుంచి ఎంసెట్‌ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని కన్వీనర్​ తెలిపారు. ఈసారి ఎంసెట్​కు ఇంటర్​ మార్కుల వెయిటేజీ ఎత్తివేశారు. కేవలం ఎంసెట్​ ఎంట్రన్స్​లో వచ్చే మార్కుల ఆధారంగా ఇంజనీరింగ్​ అడ్మిషన్లు చేపడుతారు. బీఎస్సీ నర్సింగ్​ అడ్మిషన్లు కూడా ఈసారి ఎంసెట్​ ద్వారానే చేపడుతారు.

Advertisement

పీజీ ఈసెట్‌ షెడ్యూల్​

పీజీ ఈసెట్‌ షెడ్యూల్‌ విడుదలైంది. ఈ నెల 28న పీజీ ఈసెట్‌ నోటిఫికేషన్‌ వెలువడుతుంది. మార్చి 3 నుంచి ఏప్రిల్‌ 30 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. లేట్​ ఫీజు చెల్లించి మే 24 వరకు అప్లికేషన్లకు తుది గడువుగా నిర్ణయించారు. మే 21 నుంచి పీజీ ఈసెట్‌ హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.  మే 29 నుంచి జూన్‌ 1 వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తారు.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!