తెలంగాణలో డిగ్రీ కాలేజీల్లో సీట్లు అలాటయ్యాయి. డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్ )ఫస్ట్ ఫేజ్‌లో 1.12లక్షల మందికి సీట్లు కేటాయించారు. అత్యధికంగా కామర్స్‌లో 37.55 శాతం మంది కామర్స్ కోర్సులను ఎంచుకోగా.. 23.55 శాతం మంది లైఫ్ సైన్స్ కోర్సులను ఎంచుకున్నారు. ఆర్ట్ కోర్సుల్లో 14,825 మందికి సీట్లు అలాటయ్యాయి. 51 కాలేజీల్లో ఒక్క స్టూడెంట్ చేరలేదు. ఆగస్ట్ 6 నుంచి సెకండ్ ఫేజ్ రిజిస్ర్టేషన్లు, వెబ్ ఆప్షన్లు మొదలైనట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. 77 శాతం మంది ఫస్ట్ ప్రియార్టీ ఇచ్చిన కాలేజీల్లోనే సీట్లు ఖరారయ్యాయి. అలాటైన కాలేజీల వివరాలను విద్యార్థుల మొబైల్ ఫోన్లకు ఎస్ఎంఎస్ (SMS) ద్వారా పంపించారు.
మీ కాలేజీ తెలియాలంటే.. 79010 02200 నెంబర్‌కు వాట్సప్ చేయండి
ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందని విద్యార్థులు వాట్సప్ ద్వారా తమ కాలేజీల వివరాలను పొందే సౌలభ్యం ఉంది. విద్యార్థులు తాము రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ నుంచి 79010 02200 నెంబర్‌కు వాట్సప్ చేసి Hi అని టైప్ చేయండి. దోస్త్ నుంచి వెల్కమ్ మెసేజ్ తో పాటు పది వివరాలతో మీకు రిప్లై వస్తుంది. అందులో ’7’వ నెంబర్ My Allotment అని చూపిస్తుంది. 7 నెంబర్ టైప్ చేసి మీరు రిప్లై ఇవ్వండి. అలాటైన కాలేజీ వివరాలు మీకు చేరుతాయి.
Kakathiya University
TWRDCW west 629, TWRDCW Eest-628,TTWRDC-janagaon
A prakash
Mkr
N ganesh