రెండేండ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (D.El.Ed) అండ్ డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే డీఈఈసెట్ 2021–23 నోటిఫికేషన్ వెలువడింది.
టీచర్ జాబ్ చేయాలనుకునే అభ్యర్థులకు ఈ కోర్సు పూర్తి చేయటం సదవకాశం.
ఇంటర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు, ఇంటర్ పాసైన వారందరూ ఈ పరీక్షకు హాజరు కావచ్చు.
ఈనెల ఆగస్టు 6 నుంచి 25 వరకు ఆన్ లైన్లో అప్లికేషన్లను స్వీకరించనున్నారు.
http://deecet.cdse.telangana.gov.in/ వెబ్సైట్లో రేపటి నుంచి పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయి.
అప్లికేషన్ల గడువు ముగిసిన తర్వాత ఎగ్జామ్ తేదీని ప్రకటిస్తారు.
