రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పీజీ, ఇంటిగ్రేటెడ్ పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించిన కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ (CPGET-2023) ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో అధికారులు ఈ ఫలితాలను విడుదల చేశారు. సీపీగెట్ పరీక్షలు జూన్ 30 నుంచి జులై 10 వరకు జరిగాయి. రాష్ట్రంలోని ఉస్మానియా వర్సిటీ, కాకతీయ వర్సిటీ, తెలంగాణ వర్సిటీ, పాలమూరు వర్సిటీ, మహాత్మాగాంధీ వర్సిటీ, శాతవాహన వర్సిటీ, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం, జేఎన్‌టీయూ హైదరాబాద్‌తో కలిపి మొత్తం ఎనిమిది యూనివర్సిటీల్లో 45 వివిధ కోర్సుల్లో అడ్మిషన్లకు ఈ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.
ఈ ఏడాది మొత్తం 68,422 మంది సీపీ గెట్కు దరఖాస్తు చేసుకోగా 44 సబ్జెక్టులకు 59,665 మంది పరీక్షలు రాశారు. ఇందులో 93.42 శాతం ఉత్తీర్ణులయ్యారు. అర్హత సాధించిన 55,739 మందిలో ఎక్కువ మంది అమ్మాయిలు ఉన్నారు. 37,567 మంది అమ్మాయిలు పీజీ కోర్సులకు అర్హత సాధించారు. ఈ సంవత్సరం నుంచి కొత్తగా రాష్ట్రంలో ఎమ్మెస్సీ డేటా సైన్స్ కోర్సును ప్రారంభిస్తున్నామని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఛైర్మన్ లింబాద్రి తెలిపారు. ఆగస్టు 31న దానికి ఎంట్రన్స్ నిర్వహించబోతున్నామని తెలిపారు. మహిళా వర్సిటీతోపాటు సాంఘిక సంక్షేమ గురుకులం, మరికొన్ని కళాశాలలు ఈ కోర్సు కోసం దరఖాస్తు చేశాయి.
సీపీగెట్ ఫలితాలు, కొత్త కోర్సుల వివరాలకు https://cpget.tsche.ac.in క్లిక్ చేయండి
1clasd English medium state syllabus I need