తెలంగాణలోని ఓయూ, కాకతీయ, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు,శాతవాహన, జవహర్లాల్నెహ్రు టెక్నాలజీకల్ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న ఎం.ఎ.కాం,ఎమ్మెస్సీ,జర్నలిజం, ఎంపీఈడి, ఎంబీఏ, ఐదేళ్ల ఎం.ఎ, ఎమ్మెస్సీ, పలు పీజీ డిప్లోమా కోర్సులలో అడ్మిషన్లకు నిర్వహించే పీజీ సెట్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ వెలువడింది.
ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించే ఈ పీజీ సెట్ ఎంటెన్స్ టెస్టు కు ఈనెల 30నుంచి ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలని సీపీజీఈటీ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి ప్రకటించారు.
ఈనెల 30నుంచి ఆగస్టు 25 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు.
రూ.500ల అపరాధ రుసుముతో ఆగస్టు 30 వరకు,
రూ.2వేల అపరాద రుసుముతో సెప్టెంబరు 3 వరకు దరఖాస్తు చేసుకోవాలి.
సెప్టెంబర్ 8 నుంచి ఈ పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షలన్నీ కంప్యూటర్బేస్డ్ టెస్టు ఆన్లైన్ విధానంలోనిర్వహించనున్నారు. ఈ పరీక్షల్లో వచ్చే మెరిట్ ర్యాంకుల ఆధారంగా అడ్మిషన్లు చేపడుతారు.
