ఆగస్ట్ 28న ఆదివారం జరిగే కానిస్టేబుల్ ప్రిలిమినరీ టెస్ట్ CONSTABLE PRELIMINARY WRITTEN TEST 2022 కు తెలంగాణ పోలీస్ ఉద్యోగ నియామక మండలి (TSLPRB) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పోలీస్ డిపార్టమెంట్లో ఇదే భారీ రిక్రూట్మెంట్ కావటంతో పోటీ కూడా అదే స్థాయిలో ఉంది. 16321 కానిస్టేబుల్ పోస్టులకు ఆదివారం జరిగే ప్రిలిమినరీ పరీక్షకు 6.61 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.
మొత్తం 200 మార్కులకు ఈ పరీక్ష ఉంటుంది. ఇందులో 60 మార్కులు సాధిస్తే క్వాలిఫై అయినట్లే. అయిదు తప్పుడు సమాధానాలకు ఒక నెగెటివ్ మార్కు ఉంటుంది.
TELANGANA POLICE JOBS నిబంధనల ప్రకారం.. పరీక్ష రాసే అభ్యర్థులు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. ఉదయం 10 గంటలకే పరీక్ష మొదలవుతుంది. ఒక నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను లోపలికి అనుమతించరు. ఇప్పటికే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న అభ్యర్థులు ఏ4 షీట్లో ప్రింట్ తీసుకోవాలి. అందులో ఉన్న ఖాళీ ఫొటో బాక్స్‌లో అభ్యర్థులు తప్పనిసరిగా తమ ఫొటోను గమ్‌తో అతికించుకోవాలి. ఫొటోపై పిన్లు కొట్ట కూడదు. దరఖాస్తు చేసినప్పుడు ఉపయోగించిన ఫోటోనే ఇక్కడ కూడా అతికించాలి. ఫొటో లేకుంటే పరీక్షకు అనుమతించరు.
బయోమెట్రిక్ విధానం అమల్లో ఉన్నందున అభ్యర్థులు మొహందీ, టాటూలు వేసుకోకూడదు. అభ్యర్థి పరీక్ష గదిలోకి తనవెంట హాల్‌టికెట్‌తో పాటు బ్లాక్ లేదా బ్లూ పాయింట్ పెన్‌ను మాత్రమే తీసుకెళ్లాలి. సెల్‌ఫోన్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వేటినీ అనుమతించరు. మహిళా అభ్యర్థులు నగలు ధరించకూడదు.