స్కూళ్లతో పాటు తెలంగాణలో కాలేజీలు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ప్రారంభమవనున్నాయి. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి డిగ్రీ, పీజీ, టెక్నికల్ ఎడ్యుకేషన్ కోర్సులు చదివే విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు ప్రారంభిస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రకటించారు. అదే రోజు నుంచి ఇంటర్ సెకండియర్ స్టూడెంట్స్ కు దూరదర్శన్ యాదగిరి, టీశాట్ ద్వారా డిజిటల్ క్లాసులు ప్రారంభిస్తారు.
ఆన్ లైన్, డిజిటల్ క్లాసులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇంటర్, డిగ్రీ, పీజీ కాలేజీల లెక్చరర్లు ఈనెల 27 నుంచి కళాశాలలకు రావాలని స్పెషల్ చీఫ్ సెక్రెటరీ చిత్రారాంచంద్రన్ ఆదేశించారు. ఈ– కంటెంట్, లెస్సన్ ప్లాన్ తదితర పనులు చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫిజికల్ క్లాసులపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
