అందరూ పాసయ్యారు. మరి గ్రేడ్లు.. జీపీఏ ఎలా లెక్కిస్తారని టెన్త్ విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పదో తరగతి లో నాలుగు సార్లు నిర్వహించిన ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ ఏ) మార్కుల ఆధారంగానే గ్రేడ్లు, జీపీఏ లు కేటాయిస్తారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది.
ప్రతి సబ్జెక్టు లో 20 మార్కులకు ఎప్ఏలు జరిగాయి. ఈ 20 మార్కుల్లో విద్యార్థులకు ఎంత శాతం మార్కులు వచ్చాయో వాటి పర్సంటేజీ ప్రకారం జీపీఏలను కేటాయిస్తారు. నాలుగు ఎఫ్‌ఏలను యావరేజ్ చేసి మొత్తం 100 మార్కులుగా పరిగణిస్తారు. ఉదాహరణకు ఒక విద్యార్థికి సైన్స్‌లో ఇంటర్నల్ మార్కులు 20కి 20 వచ్చి ఉంటే అతనికి వందకి 100 మార్కులు వచ్చినట్లు లెక్క. అప్పుడు ఆ విద్యార్థికి ఆ సబ్జెక్టులో ఏ–1 గ్రేడ్ (10 జీపీఏ ) వస్తుంది. అలాగే మిగిలిన అన్ని సబ్జెక్టుల్లో కూడా ఏ–1 గ్రేడ్ వస్తే.. 10/10 జీపీఏ వస్తుంది.
ఒకవేళ ఇంటర్నల్స్‌లో ఒక్కో సబ్జెక్టులో 18 మార్కులే వస్తే అతనికి మొత్తం 90 మార్కులు వచ్చినట్లు పరగిణిస్తారు. దీని ప్రకారం ఆ సబ్జెక్టులో ఏ–2 గ్రేడ్ ఇస్తారు. ఆ విద్యార్థికి 9 పాయింట్ జీపీఏ వస్తుంది.
అన్ని సబ్జెక్టుల్లో ఏ 1 గ్రేడ్ వచ్చి.. ఏ ఒక్క సబ్జెక్ట్‌లో ఏ2 గ్రేడ్ వచ్చినా.. ఆ విద్యార్థికి జీపీఏ 9.8 పాయింట్ అవుతుంది.
మిగిలిన సబ్జెక్టుల్లో కూడా వచ్చే జీపీఏ లను బట్టి యావరేజ్ మార్కుల పర్సంటేజీ ఆధారంగా గ్రేడ్లు, జీపీఏలను కేటాయిస్తారు.
టెన్త్ క్లాస్ గ్రేడింగ్ సిస్టమ్
గ్రేడ్ | అసెస్మెంట్ మార్కులు (యావరేజ్) | గ్రేడ్ పాయింట్లు |
---|---|---|
A1 | 91-100 | 10 |
A2 | 81-90 | 9 |
B1 | 71-80 | 8 |
B2 | 61-70 | 7 |
C1 | 51-60 | 6 |
C2 | 41-50 | 5 |

