Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSగురుకుల డిగ్రీ కాలేజీల్లో 868 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. విభాగాల వారీగా ఖాళీల వివరాలివే..

గురుకుల డిగ్రీ కాలేజీల్లో 868 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. విభాగాల వారీగా ఖాళీల వివరాలివే..

తెలంగాణలో కొలువుల జాతర మళ్లీ మొదలైంది. గురుకుల డిగ్రీ కాలేజీల్లో ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేసన్ విడుదలైంది. మొత్తం 868 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇందులో లెక్చరర్ ఉద్యోగాలు 793, ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగాలు 39, లైబ్రేరియర్ ఉద్యోగాలు 36 ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు.. అంటే ఏప్రిల్ 17న ప్రారంభం కానుంది. దరఖాస్తు చేసుకోవడానికి మే 17ను ఆఖరి తేదీగా నిర్ణయించారు.

Advertisement

అభ్యర్థులు ఆరోజు సాయంత్రం 5 గంటలలోగా తమ దరఖాస్తును https://treirb.telangana.gov.in/ వెబ్ సైట్లో సమర్పించాల్సి ఉంటుంది. ఈ పరీక్ష తేదీకి సంబంధించిన వివరాలను బోర్డు వెబ్ సైట్లో త్వరలో విడుదల చేస్తామని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. వేర్వేరు ఉద్యోగాలకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు. ఆ వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. వయో పరిమితి 18-44 ఏళ్లు ఉండాలి. వివిధ వర్గాల వారికి వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఆ వివరాలను సైతం నోటిఫికేషన్లో చూడొచ్చు.

RELATED POSTS

గురుకుల జాబ్స్​ OTR స్టెప్​ బై స్టెప్ ప్రాసెస్​

గురుకులాల్లో 9231 పోస్టులు.. ఏమేం పోస్టులు.. పూర్తి వివరాలు

గురుకుల్ టీచర్​, లెక్చరర్​ జాబ్స్​ ప్రీవియస్​ పేపర్లు

టీజీటీ, పీజీటీ, జేఎల్​, డీఎల్​ సిలబస్​ 2023

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!