తెలంగాణలోని గురుకుల జూనియర్ కాలేజీల్లో పలు ఉద్యోగాల భర్తీకి తెలంగాణ రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TREIRB) తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 2008 ఖాళీలను భర్తీ చేయనున్నట్లో నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇందులో లెక్చరర్ జాబ్స్ 1530, ఫిజికల్ డైరెక్టర్ జాబ్స్ 34, లైబ్రేరియన్ జాబ్స్ 50 ఉన్నాయి.
ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ సైతం ఈ రోజు అంటే ఏప్రిల్ 17న ప్రారంభం కానుంది. దరఖాస్తు చేసుకోవడానికి మే 17 లాస్ట్ డేట్. అభ్యర్థులు http://www.treirb.telangana.gov.in/ వెబ్ సైట్లో ఆ తేదీలోగా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ను త్వరలో బోర్డ్ వెబ్ సైట్లో తెలియజేస్తామని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
RELATED POSTS
Jl pepar