కరోనా నుంచి ప్రపంచం కోలుకోవటంతో టూరిజంలో బీబీఏ, ఎంబీఏ కోర్సులకు మళ్లీ డిమాండ్ మొదలైంది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ (IITTM) టూరిజం బీబీఏ, ఎంబీఏ ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అమరకంటక్లోని ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ సహాకారంతో ఈ ప్రోగ్రామ్‌లు నిర్వహిస్తోంది. నెల్లూరుతో పాటు గ్వాలియర్, భువనేశ్వర్, నోయిడా, గోవాలో IITTM క్యాంపస్‌లు ఉన్నాయి. వీటిలో అడ్మిషన్ పొందాలంటే IGNTU IITTM Admission Test (IIAT) కామన్ ఎంట్రెన్స్ , గ్రూప్ డిస్కషన్స్, పర్సనల్ ఇంటర్వ్యూ అటెండ్ చేయాల్సి ఉంటుంది.
టూరిజం అండ్ ట్రావెల్ బీబీఏ ప్రోగ్రామ్‌లో చేరేందుకు 50 శాతం మార్కులతో ఇంటర్ అర్హత సరిపోతుంది. ఇప్పుడు సెకండియర్ చదువుతున్న విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. జూలై 1 నాటికి 22 ఏళ్ల వయసు మించరాదు. మొత్తం 375 సీట్లు నెల్లూరు క్యాంపస్‌లో 75 సీట్లు, గ్వాలియర్ క్యాంపస్‌లో 112, భువనేశ్వర్ క్యాంపస్‌లో 75, నోయిడాలో 113 సీట్లు ఉన్నాయి.
టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ ఎంబీఏలో చేరేందుకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ద్వితీయ శ్రేణి మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అర్హులే. సెప్టెంటర్ నాటికి సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మ్యాట్, క్యాట్, సీమ్యాట్, గ్లాట్, జీమ్యాట్ అర్హత ఉన్న విద్యార్థులు అడ్మిషన్ టెస్ట్ లేకుండానే నేరుగా అడ్మిషన్ పొందవచ్చు. వయసు జూలై 1 నాటికి 27 ఏళ్లు మించరాదు. మొత్తం 750 సీట్లు ఉన్నాయి. నెల్లూరు క్యాంపస్‌లో 75 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
IIAT ADMISSION TEST ఐఐఏటీ అడ్మిషన్ టెస్ట్ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. మొత్తం 100 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలిస్తారు. జనరల్ అవేర్నెస్ నుంచి 50, వెర్బల్ ఎబిలిటీ నుంచి 25, క్వాంటిటేటివ్ ఎబిలిటీ నుంచి 25 ప్రశ్నలు అడుగుతారు. నెగిటీవ్ మార్కులేవీ ఉండవు. పరీక్ష సమయం 2గంటలు ఉంటుంది. అడ్మిషన్ టెస్ట్‌లో స్కోర్‌కు 70శాతం, గ్రూప్ డిస్కషన్‌కు 15శాతం, పర్సనల్ ఇంటర్వ్యూకు 15శాతం వెయిటేజి ఇచ్చి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు మే 31 చివరితేది.
ఐఐఏటీ అడ్మిషన్ టెస్ట్ జూన్ 5న నిర్వహిస్తారు. అడ్మిషన్ ఫీజు జూలై 12లోగా చెల్లించాలి.
వెబ్సైట్ : www.iittmsouth.org