తెలంగాణలో ఓపెన్ స్కూల్ (TOSS) ద్వారా టెన్త్, ఇంటర్ చదువుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్! వచ్చే అక్టోబర్‌లో జరగబోయే పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపుల షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. ఎలాంటి లేట్ ఫీజు లేకుండా ఆగస్టు 17 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. చివరి నిమిషంలో హడావుడి పడకుండా అభ్యర్థులందరూ వెంటనే ఫీజు చెల్లించి, అక్టోబర్‌లో నిర్వహించే ఎగ్జామ్స్‌కు సిద్ధమవ్వాలని సొసైటీ సూచించింది. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు..
ముఖ్యమైన తేదీలు & లేట్ ఫీజు వివరాలు:
లేట్ ఫీజు లేకుండా.. ఆగస్టు 17 వరకు ఫీజు చెల్లించవచ్చు. రూ. 25 లేట్ ఫీజుతో.. ఆగస్టు 17 లోపు చెల్లించలేకపోయిన వారికి ఆగస్టు 18 నుంచి 24 వరకు ప్రతీ పేపర్‌కు రూ.25తో అవకాశం ఉంటుంది. అంతే కాకుండా రూ. 50 లేట్ ఫీజుతో.. ఆగస్టు 25 నుంచి 29 వరకు ప్రతీ పేపర్‌కు రూ.50 ఫైన్‌తో ఫీజు పే చేయవచ్చు.
తత్కాల్ స్కీమ్ : చివరి నిమిషంలో అప్లై చేసుకునే వారి కోసం అధికారులు తత్కాల్ ఆప్షన్ కూడా ఇచ్చారు. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 2 వరకు తత్కాల్ స్కీమ్ కింద ఫీజు చెల్లించవచ్చు.
ఫీజు ఎలా చెల్లించాలి?
విద్యార్థులు TOSS అధికారిక వెబ్సైట్ telanganaopenschool.org ద్వారా ఆన్లైన్లో పే చేయవచ్చు. లేదా మీ సమీపంలో ఉన్న TG Online (టీజీ ఆన్లైన్) లేదా MeeSeva (మీసేవ) కేంద్రాలకు వెళ్ళి కూడా నేరుగా ఫీజు చెల్లించవచ్చని సొసైటీ స్పష్టం చేసింది.





