జాతీయస్థాయిలో ఉన్నత విద్యా సంస్థలకు కేంద్రం ర్యాంకులు ప్రకటించింది. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ న్యూ ఢిల్లీ లో 2022 నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేం వర్క్(ఎన్ ఐ ఆర్ ఎఫ్) నివేదిక ని విడుదల చేసారు.ఇంజనీరింగ్,మెడికల్,లా,మేనేజ్ మెంట్ సహా 11 కేటగిరీలలో దేశం లోని విద్యా,పరిశోధన సంస్థలకి ఈ ర్యాంకింగ్ లు ఇస్తారు.ఈ ఏడాది సుమారు 7,254 సంస్థలకి ర్యాంకులు ఇచ్చారు.
ఈ ఏడాది కూడా ఓవరాల్ కేటగిరీలో మొదటి ర్యాంక్ ఐఐటీ మద్రాస్, రెండో స్థానంలో ఐఐఎస్సీ బెంగళూరు, మూడో స్థానంలో ఐఐటీ బాంబే నిలిచాయి
1st RANK. IIT MADRAS
2nd RANK. IISC BANGALORE
3rd RANK. IIT MUMBAI
యూనివర్సిటీ కేటగిరీ:
మొదటిస్థానంలో ఐఐఎస్సీ బెంగళూరు,
రెండోస్థానంలో జేఎన్యూ-న్యూఢిల్లీ,
మూడోస్థానంలో జామియా మిలియా ఇస్లామియా, న్యూఢిల్లీ
ఇంజనీరింగ్ కేటగిరీ
మొదటిస్థానంలో ఐఐటీ మద్రాస్,
రెండోస్థానంలో ఐఐటీ ఢిల్లీ,
మూడోస్థానంలో ఐఐటీ బాంబే
మేనేజ్మెంట్ విభాగం
మొదటి స్థానంలో ఐఐఎం అహ్మదాబాద్,
రెండోస్థానంలో ఐఐఎం బెంగళూరు,
మూడోస్థానంలో ఐఐఎం కోల్‌కత్తా