HomeLATESTమూడు డీఏలకు క్లియరెన్స్​

మూడు డీఏలకు క్లియరెన్స్​

రెండేండ్ల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్న డీఏను రాష్ట్ర కేబినేట్​ క్లియర్​ చేసింది. గత ఏడాది డిసెంబర్​ నాటికి పెండింగ్​లో ఉన్న నాలుగు డీఏల్లో.. మూడింటికి ఆమోదం తెలిపింది. దీంతో ఉద్యోగులకు బేసిక్​ పే కు 10.01 శాతం డీఏ యాడ్​ కానుంది. డిసెంబర్ నాటికి నాలుగు డీఏలు పెండింగ్ ఉన్నాయంటూ ఆర్థికశాఖ కేబినేట్​కు నివేదించింది. అందులో మూడింటికి సీఎం కేసీఆర్​ క్లియరెన్స్​ ఇచ్చారు. దీంతో నేడో రేపో అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి.

2013 నుంచి 2019 డిసెంబరు 31వరకు అమలు చేసిన కరువు భత్యాల(డీఏల) మొత్తం 30.392 శాతాన్ని పాత వేతనాల్లో విలీనం చేసి, ఫిట్‌మెంట్‌తో కలిపి కొత్త వేతనాలను అమలు చేశారు. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకూ డీఏలు పెండింగ్‌లోనే పడిపోయాయి. పెండింగ్​లో ఉన్న డీఏలన్నీ కలిపితే రాష్ట్ర ఉద్యోగులకు డీఏల మొత్తం 12.74 శాతం రావాలి. వీటిలో మూడింటికి ఆమోదం రావటంతో 10.01 శాతం డీఏ ఉద్యోగులకు అందనుంది.

కేబినేట్​ ఆమోదించిన డీఏలు

జనవరి, 2020 3.64

జూలై, 2020 2.73

జనవరి, 2021 3.64

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!