Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSగురుకులాల్లో 58 పోస్టులు

గురుకులాల్లో 58 పోస్టులు

తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్లు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో ఔట్ సోర్సింగ్ ప్రతిపాదికన నాన్‌ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టులు–58 ఆన్‌లైన్‌లో అప్లై చేయడానికి చివరితేది జులై 30.
పోస్టుల వివరాలు           ఎలిజిబులిటీ
స్టాఫ్ నర్స్‌    ఇంటర్/ బీఎస్సీ నర్సింగ్‌/ నర్సింగ్ ట్రైనింగ్‌
కేర్ టేకర్ (డిగ్రీ కాలేజ్‌)         డిగ్రీ ఉత్తీర్ణత
ల్యాబ్ అసిస్టెంట్(డిగ్రీ కాలేజ్‌)  డిగ్రీ/బీఎస్సీ ఫిజికల్ సైన్స్‌/లైఫ్ సైన్స్‌ కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్‌  బీఏ కంప్యూటర్ సైన్స్‌
జూనియర్ అసిస్టెంట్    డిగ్రీ/టైప్ రైటింగ్‌/ కంప్యూటర్ అప్లికేషన్ సర్టిఫికెట్
ల్యాబ్ అటెండర్‌‌           టెన్త్/ ల్యాబ్ పరికరాలపై అవగాహన
కిచెన్ హెల్పర్               టెన్త్‌/ డ్రైవింగ్‌
ఆఫీస్ సబార్డినేట్‌           టెన్త్‌/డ్రైవింగ్‌
సెలెక్షన్ ప్రాసెస్‌/వేతనం
అన్ని పోస్టులు స్టడీ సర్టిఫికెట్లలో మెరిట్ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు.  స్టాఫ్ నర్స్‌–రూ.17,500, కేర్ టేకర్‌‌–రూ.15,000, ల్యాబ్ అసిస్టెంట్‌–రూ.15,000, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్‌– రూ.20,000, జూనియర్ అసిస్టెంట్–రూ.15,000, ల్యాబ్ అటెండర్ –రూ.1,5000, కిచెన్ హెల్పర్– రూ.12,000, ఆఫీస్ సబార్డినేట్‌–రూ.12,000
దరఖాస్తు ఫీజు–రూ.50
వెబ్‌సైట్‌:  www.tgtwgurukulam.telangana.gov.in

Advertisement

ఎన్‌టీపీసీలో 275 పోస్టులు

కేంద్ర ప్రభుత్వ రంగ మహారత్న కంపెనీ నేష‌న‌ల్ థ‌ర్మల్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌(ఎన్‌టీపీసీ).. దేశ వ్యాప్తంగా ఉన్న సంస్థకు చెందిన కేంద్రాల్లో 275 పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్లైన్లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
పోస్టులు–ఖాళీలు: ఇంజినీర్‌–250, అసిస్టెంట్ కెమిస్ట్‌–25
అర్హత: సంబంధిత విభాగాల్లో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో కనీసం మూడేళ్ల పని అనుభవం
విభాగాలు: ఎల‌క్ట్రిక‌ల్‌, మెకానిక‌ల్‌, ఎల‌క్ట్రానిక్స్‌, ఇనుస్ట్రుమెంటేష‌న్‌
వయసు: 30 ఏళ్లు మించకూడదు
ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ.300, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ/ఎక్స్సర్వీస్మెన్, మహిళలకు ఫీజు లేదు
చివ‌రి తేది: 2020 జులై 31
వెబ్సైట్: www.ntpccareers.net

జేఎన్‌టీయూ హైద‌రాబాద్‌లో..

హైద‌రాబాద్‌లోని జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ టెక్నలాజిక‌ల్ యూనివ‌ర్సిటీ(జేఎన్‌టీయూ).. 4 పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ–మెయిల్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. పోస్టులు: ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, ఫీల్డ్ వ‌ర్కర్‌; అర్హత‌: సంబంధిత స‌బ్జెక్టుల్లో బీఎస్సీ/ డిప్లొమా, ఎమ్మెస్సీ/ ఎంటెక్, నెట్/గేట్ ఉత్తీర్ణత‌తో పాటు పని అనుభ‌వం; సెలెక్షన్ ప్రాసెస్: ఆన్‌లైన్ ఇంట‌ర్వ్యూ ద్వారా; ఈ–మెయిల్‌: drvhimabindu@jntuh.ac.in; చివ‌రి తేది:2020 జులై 18; వివరాలకు: www.jntuh.ac.in

ఈసీఐఎల్‌ హైదరాబాద్లో..

హైద‌రాబాద్లోని ఎల‌క్ట్రానిక్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌(ఈసీఐఎల్‌).. 10 విజిటింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్లైన్లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.  విభాగాలు: వీఎల్ఎస్ఐ డిజైన్‌, ఎంబ‌డెడ్ డిజైన్‌, జావా, ఆండ్రాయిడ్ క్లౌడ్ కంప్యూటింగ్, ఐవోటీ టెక్నాలజీస్, మ్యాట్లాబ్/సిమ్యూలింక్ త‌దిత‌రాలు; అర్హత‌: ఈసీఈ/సీఎస్ఈ/ఈఈఈ బ్రాంచుల్లో బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణత‌తో పాటు పని అనుభవం; సెలెక్షన్ ప్రాసెస్: అక‌డ‌మిక్ అచీవ్‌మెంట్‌, ఇంట‌ర్వ్యూ ద్వారా; చివ‌రి తేది: 2020 జులై 25; వివరాలకు: www.ecil.co.in

Advertisement

నేషనల్ సీడ్స్ కార్పొరేషన్‌లో 220 ఉద్యోగాలు

అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ పరిధిలోని నేషనల్ సీడ్ కార్పొరేషన్ లిమిటెడ్‌ నాణ్యమైన విత్తనాల తయారీ, పంపిణీ తయారీలో పేరుగాంచింది.  ఈ సంస్థకు ఢిల్లీ సహా ఇండియా మొత్తంలో 65 యూనిట్లు ఉన్నాయి. వీటిల్లో  వివిధ విభాగాల్లో 220 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
ఎలిజిబులిటీ
అసిస్టెంట్ లీగల్ గ్రేడ్‌–1 ఉద్యోగానికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి  న్యాయ విద్యలో ప్రొఫెషనల్ డిగ్రీ పట్టా పొంది ఉండాలి. ఒక ఏడాది పాటు అనుభవం ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిఉండాలి. డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులైతే దిగువ పోస్టుల్లో రెండేళ్ల పాటు పనిచేసి ఉండాలి. మేనేజ్‌మెంట్ ట్రెయినీ, ట్రెయినీ, ట్రెయినీ మేట్‌ ఉద్యోగాలకు సంబంధిత సబ్జెక్టుల్లో ఐటీఐ, బీఎస్సీ, బీఈ, బీటెక్, ఎంబీఏ, ఎమ్మెస్సీ, పీజీ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్‌ అవసరం.  వెబ్‌సైట్‌: www.indiaseeds.com
వయసు
అసిస్టెంట్ గ్రేడ్‌–1 ఉద్యోగానికి 30 ఏళ్లు, మేనేజ్‌మెంట్ ట్రెయినీ,  సీనియర్ డిప్లొమా ట్రెయినీ, ట్రెయినీ ఉద్యోగాలకు 27 ఏళ్లు, ట్రెయినీ మేట్‌కు 25 ఏళ్లు మించరాదు. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు ఎక్స్‌ సర్వీస్‌మెన్‌లకు మినహాయింపు ఉంటుంది.
సెలెక్షన్ ప్రాసెస్‌
కంప్యూటర్ బేస్‌డ్  టెస్ట్‌, ఇంటర్య్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు. అసిస్టెంట్ గ్రేడ్‌–1 పోస్టులను డెరెక్టుగా రిక్రూట్ చేస్తారు.  మేనేజ్‌మెంట్ ట్రెయినీలు, సీనియర్/డిప్లొమా ట్రెయినీలు, ట్రెయినీ, ట్రెయినీ మేట్‌లకు ఏడాది పాటు ట్రెయినింగ్ ఉంటుంది. ఈ టైమ్‌లో వారికి స్టైపెండ్ ఇస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం వారి పనితీరు సంతృప్తి కరంగా ఉంటే  మేనేజ్‌మెంట్ ట్రెయినీలను  అసిస్టెంట్ మేనేజర్‌‌ ఉద్యోగంలో నియమిస్తారు. వీరికి రూ.40,000–1,40,000 జీతం అందుతుంది. సీనియర్/డిప్లొమా ట్రెయినీలను అసిస్టెంట్ గ్రేడ్‌ –1 ఉద్యోగంలో నియమిస్తారు. వీరికి రూ. 22,000–77,000 జీతం అందుతుంది. ట్రెయినీలను అసిస్టెంట్ గ్రేడ్‌–5 ఉద్యోగంలో నియమిస్తారు. వీరికి ప్రారంభ వేతనం రూ.17వేలు ఇస్తారు. ట్రెయినీ మేట్‌లను మేట్‌లుగా ఉద్యోగంలో నియమిస్తారు. వీరికి రూ. 16,500 ప్రారంభ వేతనం అందుతుంది. ట్రెయినింగ్ తర్వాత సంస్థలో కనీసం మూడేళ్లు పనిచేయాలి. ఇందుకు నాన్‌ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్‌‌పై అగ్రిమెంట్ రాసివ్వాలి.

ఎన్‌సీఎల్ లో 520 ఖాళీలు

నేషనల్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్ మధ్యప్రదేశ్‌ లో సూపర్‌‌వైజర్, టెక్నీషియన్ విభాగాల్లో 512 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.  ఆన్‌లైన్‌లో అప్లై చేసేందుకు ఆగస్టు 25  చివరితేది. రాత పరీక్షలో మెరిట్ సాధించిన వారికి సెలెక్ట్ చేస్తారు.
పోస్టుల వివరాలు
డిపార్ట్‌మెంట్                    పోస్టు                                     వేతనం
సూపర్‌‌వైజర్‌‌                      అసిస్టెంట్ ఫోర్‌‌మెన్‌ (ఈ&టీ) ట్రెయినీ, అసిస్టెంట్ ఫొర్‌‌మెన్‌ మెకానికల్ ట్రెయినీ   రూ.31,852 /నెలకు
టెక్నీషియన్‌                       ఫిట్టర్, ఎలక్రీషియన్, ట్యూనర్‌‌, మెకానికల్, వెల్డర్‌‌                   రూ.1065/రోజుకు
ఎలిజిబులిటీ
అసిస్టెంట్ ఫొర్‌‌మెన్ పోస్టులకు డిప్లొమా ఎలక్ర్టానిక్స్,  ఇంజనీరింగ్, టెక్నీషియన్ పోస్టులకు సంబంధిత ట్రేడుల్లో  రెండేల్ల ఐటీఐ కోర్సు, ఏడాది అప్రెంటిస్‌షిప్‌ ట్రైనింగ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. (ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు మినహాయింపు ఉంటుంది.)
,నోటిఫికేషన్
అప్లికేషన్ ప్రారంభం ఆగస్టు 03
లాస్ట్ డేట్‌ ఆగస్టు 25
ఫీజు: రూ.500 (ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు మినహాయింపు)
ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి.
వెబ్‌సైట్‌: www.nclcil.in

నాడా, న్యూఢిల్లీలో..

న్యూఢిల్లీలోని నేష‌న‌ల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(నాడా).. 11 కాంట్రాక్టు పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆఫ్లైన్లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. పోస్టులు: రీజిన‌ల్ కో-ఆర్డినేట‌ర్‌, యంగ్ ప్రొఫెష‌నల్‌, టెక్నిక‌ల్ ఆఫీస‌ర్‌, ఎంటీఎస్‌; అర్హత‌: ప‌దోత‌ర‌గ‌తి, ఎండీ, బీఈ/బీటెక్/ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభ‌వం; సెలెక్షన్ ప్రాసెస్: ఇంట‌ర్వ్యూ ద్వారా; చివ‌రి తేది: 2020 జులై 23; వివరాలకు: www.nadaindia.org/

Advertisement

టీఎంసీలో 106 పోస్టులు

టాటా మెమోరియ‌ల్ సెంట‌ర్‌(టీఎంసీ) పరిధిలోని గౌహతిలోని డాక్టర్ భువ‌నేశ్వర్ బ‌రూహా క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్.. 106 పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్లైన్/ఆఫ్లైన్లో ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులు: అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌, మెడిక‌ల్ ఫిజిసిస్ట్, సైంటిఫిక్ ఆఫీస‌ర్‌, సైంటిఫిక్ అసిస్టెంట్‌, ఫార్మసిస్ట్, అసిస్టెంట్ డైటీషియ‌న్‌, అసిస్టెంట్  మెడికల్ సోషల్ వర్కర్, హౌజ్కీపర్, టెక్నీషియన్ త‌దిత‌రాలు; అర్హత‌: 10+2, డిప్లొమా(మెడికల్ ల్యాబ్ టెక్నాల‌జీ), జీఎన్ఎం/ బీఎస్సీ ఇన్ న‌ర్సింగ్, బీఫార్మసీ, మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత‌తో పాటు పని అనుభ‌వం; సెలెక్షన్ ప్రాసెస్: రాత‌ప‌రీక్ష/ ఇంట‌ర్వ్యూ/ స్కిల్ టెస్ట్ ద్వారా; ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ.300, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు ఫీజు లేదు. చివ‌రి తేది: 2020 జులై 24; హార్డ్‌కాపీల‌ను పంప‌డానికి: 2020 ఆగస్ట్ 7; వివరాలకు: www.tmc.gov.in

ఐఐటీ, కాన్పూర్‌లో..

కాన్పూర్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ(ఐఐటీ).. కాంట్రాక్టు ప్రాతిపదికన 4 సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ–మెయిల్లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. అర్హత‌: సంబంధిత సబ్జెక్టుల్లో పోస్టు గ్రాడ్యుయేష‌న్‌తో పాటు యూజీసీ నెట్‌/ గేట్ ఉత్తీర్ణత; సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్‌లిస్టింగ్‌, స్కైప్/జూమ్ ఇంట‌ర్వ్యూ ద్వారా; ఈ–మెయిల్‌: rkbajpai@iitk.ac.in; చివ‌రి తేది: 2020 జులై 20; వివరాలకు: www.iitk.ac.in

హెచ్ఎంటీ మెషిన్ టూల్స్‌లో..

కేర‌ళ‌లోని హెచ్ఎంటీ మెషిన్ టూల్స్ లిమిటెడ్.. కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న 4 పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆఫ్లైన్లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. పోస్టులు: టెక్‌/ఆఫీస్‌/ఎగ్జిక్యూటివ్ క‌న్సల్టెంట్‌, అసోసియేట్‌; అర్హత‌: డిప్లొమా, బీటెక్, ఎంబీఏ ఉత్తీర్ణత‌తో పాటు పని అనుభ‌వం; సెలెక్షన్ ప్రాసెస్: అక‌డ‌మిక్ మెరిట్‌, ఇంట‌ర్వ్యూ ద్వారా; చివ‌రి తేది: 2020 జులై 25; వివరాలకు: www.hmtmachinetools.com

Advertisement

ఐకార్‌డీఎఫ్ఎండీలో 11 పోస్టులు

ఉత్తరాఖండ్లోని ఐకార్‌కి చెందిన -డైరెక్టరేట్ ఆఫ్ ఫుట్ అండ్ మౌత్ డిసీజ్‌(డీఎఫ్ఎండీ).. కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న 11 పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ–మెయిల్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. పోస్టులు–-ఖాళీలు: సీనియ‌ర్ రిసెర్చ్ ఫెలో–08, యంగ్ ప్రొఫెష‌న‌ల్‌–03; అర్హత‌: సంబంధిత స‌బ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ/ఎంసీఏ/ఎంబీఏ ఉత్తీర్ణత‌తో పాటు పని అనుభ‌వం; సెలెక్షన్ ప్రాసెస్: ఇంట‌ర్వ్యూ ద్వారా; చివ‌రి తేది: 2020 జులై 20; వివరాలకు: www.pdfmd.ernet.in

ఐఐటీ ఢిల్లీలో ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్స్

న్యూఢిల్లీలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ).. కాంట్రాక్టు పద్ధతిలో 39 ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్లైన్లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. అర్హత‌: బీఈ/బీటెక్‌/ మాస్టర్స్ డిగ్రీ, ఎంబీఏ ఉత్తీర్ణత‌తో పాటు పని అనుభ‌వం; వ‌య‌సు: 45 ఏళ్లు మించ‌కూడదు; సెలెక్షన్ ప్రాసెస్: రాత‌పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా; చివ‌రి తేది: 2020 జులై 24; వివరాలకు: www.iitd.ac.in

ఎస్‌జేహెచ్ & వీఎంఎంసీలో..

న్యూఢిల్లీలోని స‌ఫ్తర్‌జంగ్ హాస్పిట‌ల్ & వ‌ర్థమాన్ మ‌హావీర్ మెడిక‌ల్ కాలేజ్(వీఎంఎంసీ).. అడహక్ ప్రాతిపదికన 106 జూనియర్ రెసిడెంట్ పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ–మెయిల్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. అర్హత‌: ఎంబీబీఎస్ ఉత్తీర్ణత‌తో పాటు ఇంట‌ర్న్‌షిప్ చేసి ఉండాలి. సెలెక్షన్ ప్రాసెస్: ఇంట‌ర్వ్యూ ద్వారా; ఈ–మెయిల్‌: ao.academic@vmmc-sjh.nic.in; చివ‌రి తేది: 2020 జులై 21; వివరాలకు: www.vmmc-sjh.nic.in

Advertisement

ఐఐటీ ద‌ర్వాడ్‌లో..

క‌ర్నాట‌క‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ(ఐఐటీ), దర్వాడ్.. కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న 5 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్లైన్లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. పోస్టులు–ఖాళీలు: జూనియ‌ర్ రిసెర్చ్ ఫెలో–02, ప్రాజెక్ట్ అసోసియ‌ట్‌–03; అర్హత‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో ఎంటెక్/ ఎంఈ/ ఎంఎస్, బీఈ/బీటెక్, గేట్ ఉత్తీర్ణత‌తో పాటు పని అనుభ‌వం; చివ‌రి తేది: 2020 జులై 24; వివరాలకు: www.iitdh.ac.in

ఐఐపీలో 46 ప్రాజెక్ట్ స్టాఫ్

దెహ్రాదూన్‌లోని సీఎస్ఐఆర్‌కి చెందిన -ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం(ఐఐపీ).. కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న 46 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్లైన్లో ద‌రఖాస్తు చేసుకోవాలి. పోస్టులు–ఖాళీలు: ప్రాజెక్ట్ అసోసియేట్‌–38, సీనియ‌ర్ ప్రాజెక్ట్ అసోసియేట్‌–05, ల్యాబొరేట‌రీ అసిస్టెంట్–03; అర్హత‌: సంబంధిత స‌బ్జెక్టుల్లో బీఎస్సీ, బీఈ/బీటెక్‌, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత‌తో పాటు పని అనుభ‌వం; సెలెక్షన్ ప్రాసెస్: ఆన్‌లైన్ ఇంట‌ర్వ్యూ ద్వారా; చివ‌రి తేది: 2020 జులై 24; వివరాలకు: www.iip.res.in

ఎన్ఐఆర్ఆర్‌హెచ్‌లో..

ముంబ‌యిలోని ఐసీఎంఆర్‌కి చెందిన -నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ రిసెర్చ్ ఇన్ రిప్రొడ‌క్టివ్ హెల్త్‌(ఎన్ఐఆర్ఆర్‌హెచ్).. కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న 24 పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్లైన్లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. పోస్టులు–ఖాళీలు: సైంటిస్ట్‌–01, టెక్నిక‌ల్ ఆఫీస‌ర్‌–10, డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్‌–07, మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్–06; అర్హత‌: ప‌దోత‌ర‌గ‌తి, 10+2, సంబంధిత స‌బ్జెక్టుల్లో డిగ్రీ, ఎంబీబీఎస్/ఎండీ, పీజీ ఉత్తీర్ణత‌తో పాటు పని అనుభ‌వం; సెలెక్షన్ ప్రాసెస్: ఆన్లైన్ ఇంట‌ర్వ్యూ ద్వారా; చివ‌రి తేది: 2020 జులై 20; వివరాలకు: www.nirrh.res.in/

Advertisement

ఐపీఆర్‌లో సైంటిఫిక్, టెక్నిక‌ల్‌ పోస్టులు

గుజరాత్‌లోని  ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ ప్లాస్మా రీసెర్చ్‌(ఐపీఆర్‌)  పలు విభాగాల్లో పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.  ఖాళీలు: 19; పోస్టులు :సైంటిఫిక్ ఆఫీస‌ర్‌-06, సైంటిఫిక్ అసిస్టెంట్‌-09, టెక్నీషియ‌న్‌-04;అర్హత‌: పోస్టును అనుస‌రించి సంబంధిత ట్రేడుల్లో/ స‌బ్జెక్టుల్లో ఐటీఐ, డిప్లోమా(ఇంజినీరింగ్‌), బీఎస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత‌, అనుభ‌వం; ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష/ ఇంట‌ర్వ్యూ ఆధారంగా; ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. చివరితేది : ఆగస్ట్‌ 15; వివరాలకు: www.ipr.res.in/

ఎన్ఐపీజీఆర్‌లో ..

న్యూఢిల్లీలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జీనోమ్ అండ్ రీసెర్చ్‌(ఎన్ఐపీజీఆర్‌) తాత్కాలిక ప్రాతిపదిక‌న జేఆర్ఎఫ్‌, ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు   భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.ఖాళీలు: 03; పోస్టులు: జూనియ‌ర్ రిసెర్చ్ ఫెలో-01, ప్రాజెక్ట్ అసోసియేట్‌-02;అర్హత‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో ఎమ్మెస్సీ/ ఎంటెక్ డిగ్రీ ఉత్తీర్ణత‌, నెట్;  ఎంపిక విధానం: ఆన్‌లైన్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా; ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేయాలి; చివరితేది: జులై 27; వివరాలకు: www.nipgr.ac.in/

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!