Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSఎస్ఎస్‌సీలో 283 ట్రాన్స్​లేటర్​ పోస్టులు

ఎస్ఎస్‌సీలో 283 ట్రాన్స్​లేటర్​ పోస్టులు

స్టాఫ్ సెల‌క్షన్ క‌మిష‌న్‌(ఎస్ఎస్‌సీ).. 283 గ్రూప్‌–బి నాన్‌గెజిటెడ్ పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్​ ద్వారా సెంట్రల్​ మినిస్ట్రీ పరిధిలోని వివిధ డిపార్ట్​మెంట్స్​లో ఉద్యోగాల భర్తీ ఉంటుంది. ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి.

Advertisement

పోస్టులు–ఖాళీలు: జూనియ‌ర్ ట్రాన్స్‌లేట‌ర్‌/ జూనియ‌ర్ హిందీ ట్రాన్స్‌లేట‌ర్‌–275, సీనియ‌ర్ హిందీ ట్రాన్స్‌లేట‌ర్–8
అర్హత‌: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉతీర్ణతతో పాటు ట్రాన్స్​లేషన్​లో డిప్లొమా సర్టిఫికెట్​ కోర్సు చేసి ఉండాలి.
వ‌య‌సు: 2021 జనవరి 1 నాటికి 18–30 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
సెలెక్షన్​ ప్రాసెస్​: పేపర్​–1(ఆబ్జెక్టివ్​ టైప్​), పేపర్​–2(డిస్క్రిప్టివ్​) ద్వారా సెలెక్షన్​ ఉంటుంది. పేపర్​–1లో జనరల్​ హిందీ, జనరల్​ ఇంగ్లిష్ రెండు విభాగాలుంటాయి. ప్రతి విభాగం నుంచి ప్రశ్నకు 1 మార్కు చొప్పున 100 ప్రశ్నలుంటాయి. రెండు విభాగాల్లో కలిపి మొత్తం మార్కులు 200. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత ఉంటుంది. డ్యురేషన్​ 120 నిమిషాలు. పేపర్​–1లో క్వాలిఫై​ అయిన వారికి పేపర్​–2 కండక్ట్​ చేస్తారు. మొత్తం 200 మార్కులకు డిస్క్రిప్టివ్​ తరహా ట్రాన్స్​లేషన్​ అండ్​ ఎస్సే పరీక్ష ఉంటుంది. డ్యురేషన్​ 120 నిమిషాలు. పేపర్​–1,2లో వచ్చిన మార్కుల ఆధారంగా ఫైనల్ సెలెక్షన్​ ఉంటుంది.
ఫీజు: రూ.100, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ/ఎక్స్​ సర్వీస్​మెన్​లకు ఫీజు లేదు.
చివ‌రి తేది: 2020 జులై 25 ఫీజు : 2020 జులై 27 వెబ్​సైట్​: www.ssc.nic.in

ఆర్‌సీబీలో 37 ప్రాజెక్ట్​ స్టాఫ్​

ఫ‌రీదాబాద్‌ ప్రధాన‌ కేంద్రంగా ఉన్న రీజిన‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ బ‌యోటెక్నాల‌జీ(ఆర్‌సీబీ).. కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న 37 ప్రాజెక్ట్ స్టాఫ్​ పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
పోస్టులు: ప్రాజెక్ట్ హెడ్‌, సీనియ‌ర్ సైంటిస్ట్‌, రిసెర్చ్ క‌న్సల్టెంట్‌, డేటాబేస్ మేనేజ‌ర్‌, సైంటిస్ట్‌, డేటా క్యూరేట‌ర్‌, సిస్టమ్​ అడ్మినిస్ట్రేటర్​, స్టోరేజ్ అడ్మినిస్ట్రేట‌ర్, సీనియర్​ ప్రోగ్రామర్​ త‌దిత‌రాలు; అర్హత‌: సంబంధిత స‌బ్జెక్టుల్లో గ్రాడ్యుయేష‌న్‌, బీటెక్‌/ఎమ్మెస్సీ, ఎంటెక్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణత‌తో పాటు పని అనుభ‌వం;
సెలెక్షన్​ ప్రాసెస్​: షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ద్వారా; ఫీజు: రూ.1000, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ/మహిళలకు రూ.1000;
చివ‌రి తేది: 2020 జులై 18; వివరాలకు: www.rcb.res.in

Advertisement

సీఎంఈఆర్ఐలో 17 ప్రాజెక్ట్ స్టాఫ్

సీఎస్ఐఆర్కి చెందిన దుర్గాపూర్‌లోని సెంట్రల్ మెకానిక‌ల్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌(సీఎంఈఆర్ఐ).. 17 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ–మెయిల్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. పోస్టులు: ప్రాజెక్ట్- అసోసియేట్, ప్రాజెక్ట్ జేఆర్ఎఫ్‌, ప్రాజెక్ట్ అసిస్టెంట్‌; అర్హత‌: సంబంధిత విభాగాల్లో బీఈ/బీటెక్‌, ఎంఈ/ఎంటెక్‌, ఎమ్మెస్సీ ఉత్తీర్ణత‌తో పాటు యూజీజీ–నెట్‌/ గేట్తో పాటు పని అనుభ‌వం; విభాగాలు: మాన్యుఫ్యాక్చరింగ్/ప్రొడక్షన్/ఇండస్ట్రియల్/మెకానికల్ తదితరాలు; సెలెక్షన్ ప్రాసెస్:  షార్ట్లిస్టింగ్, ఇంట‌ర్వ్యూ ద్వారా; ఈ–మెయిల్‌: temprct@cmeri.res.in;
చివ‌రి తేది: 2020 జులై 12; వివరాలకు: www.cmeri.res.in

నిట్‌, వ‌రంగ‌ల్‌లో..

Advertisement

వ‌రంగ‌ల్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ(నిట్‌).. కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న 3 రీసెర్చ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆఫ్లైన్, ఈ–మెయిల్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. పోస్టులు: జూనియ‌ర్ రిసెర్చ్ ఫెలో(జేఆర్ఎఫ్‌), సీనియ‌ర్ రిసెర్చ్ ఫెలో(ఎస్ఆర్ఎఫ్‌), రిసెర్చ్ అసోసియేట్‌(ఆర్ఏ); అర్హత‌: సంబంధిత స‌బ్జెక్టు్ల్లో ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ, గేట్‌/ నెట్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభ‌వం; సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్‌లిస్టింగ్, ఇంట‌ర్వ్యూ ద్వారా; ఈ–మెయిల్‌: satya@nitw.ac.in;
చివ‌రి తేది: 2020 జులై 13; వివరాలకు: www.nitw.ac.in

బీఈసీఐఎల్‌, నోయిడాలో..

మినిస్ట్రీ ఆఫ్  ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్కి చెందిన నోయిడాలోని బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ క‌న్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(బీఈసీఐఎల్‌).. కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న 35 పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆఫ్లైన్లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. పోస్టులు: అడ్మినిస్ట్రేటివ్ ఎగ్జిక్యూటివ్‌, అకౌంట్ ఎగ్జిక్యూటివ్‌, సూపర్వైజర్, రేడియోగ్రాఫ‌ర్, ల్యాబ్ అసిస్టెంట్‌, జూనియ‌ర్ ల్యాబ్ టెక్నాల‌జిస్ట్, క్యాషియర్ త‌దిత‌రాలు; అర్హత‌: ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్‌, డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత‌తో పాటు పని అనుభ‌వం; ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ.500, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు రూ.250;
చివ‌రి తేది: 2020 జులై 15. వివరాలకు: www.becil.com

Advertisement

ఎంఎంఆర్డీఏలో 110 పోస్టులు

మహారాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ మహా ముంబ‌యి మెట్రోపాలిట‌న్ రీజియ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ (ఎంఎంఆర్డీఏ).. 110 పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్లైన్లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. పోస్టులు–ఖాళీలు: టెక్నీషియ‌న్‌–106, ట్రైన్ ఆప‌రేట‌ర్–-1, జూనియ‌ర్ ఇంజినీర్–01, ట్రాఫిక్ కంట్రోల‌ర్‌–01, హెల్పర్‌–01; విభాగాలు: సివిల్‌, ఎస్&టీ, ఈ&ఎం, షంటింగ్‌, స్టోర్‌; అర్హత‌: సంబంధిత విభాగాల్లో డిగ్రీ/ డిప్లొమా, ఐటీఐ/ ఎన్‌సీవీటీ/ ఎస్‌సీవీటీ ఉత్తీర్ణత‌తో పాటు పని అనుభ‌వం;‌ సెలెక్షన్ ప్రాసెస్: రాత‌ప‌రీక్ష ద్వారా; ఫీజు: జనరల్కు రూ.300, ఇతరులకు రూ.150;
చివ‌రి తేది: 2020 జులై 27; వివరాలకు: www.mmrda.maharashtra.gov.in

హెచ్ఎస్ఎల్‌, వైజాగ్లో 15 ఖాళీలు

Advertisement

విశాఖపట్నంలోని హిందూస్థాన్ షిప్‌యార్డు లిమిటెడ్ (హెచ్ఎస్ఎల్‌).. 15 పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్లైన్లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.పోస్టులు–ఖాళీలు: మేనేజ‌ర్‌–7, అసిస్టెంట్ మేనేజ‌ర్‌–2, మెడిక‌ల్ ఆఫీస‌ర్‌–6; విభాగాలు: ఇంజినీరింగ్‌, ఎల‌క్ట్రిక‌ల్‌, నావ‌ల్ ఆర్కిటెక్చర్‌, హెచ్ఆర్‌; అర్హత‌: సంబంధిత విభాగాల్లో బ్యాచిలర్స్ డిగ్రీ/మాస్టర్స్ డిగ్రీ, ఎంబీబీఎస్ ఉత్తీర్ణత‌తో పాటు పని అనుభ‌వం; సెలెక్షన్ ప్రాసెస్: ఇంట‌ర్వ్యూ ద్వారా;
చివ‌రితేది: 2020 జులై 21; హార్డ్ కాపీలు పంప‌డానికి: 2020 జులై 25; వివరాలకు: www.hslvizag.in

ఐఐపీఈలో 30 నాన్ టీచింగ్ స్టాఫ్

విశాఖ‌ప‌ట్నంలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎన‌ర్జీ(ఐఐపీఈ).. 30 పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్లైన్లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. పోస్టులు: లైబ్రేరియ‌న్‌, డిప్యూటీ లైబ్రేరియ‌న్‌, ఆఫీస‌ర్ ఐటీ, సీనియ‌ర్ సూప‌రింటెండెంట్‌, టెక్నీషియ‌న్‌, టెక్నిక‌ల్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ త‌దిత‌రాలు; అర్హత‌: సంబంధిత స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ, బీఈ/బీటెక్‌, ఎంఈ/ఎంటెక్‌/ఎంసీఏ, ఎమ్మెస్సీ ఉత్తీర్ణత‌తో పాటు పని అనుభ‌వం; సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్‌లిస్టింగ్, రిటెన్/ ట్రేడ్/ కంప్యూటర్ టెస్ట్‌, ఇంట‌ర్వ్యూ ద్వారా;
చివ‌రి తేది: 2020 జులై 24; వివరాలకు: www.iipe.ac.in

Advertisement

టీఐఎఫ్ఆర్‌లో 28 ఖాళీలు

ముంబ‌యిలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండ‌మెంట‌ల్ రిసెర్చ్‌(టీఐఎఫ్ఆర్‌).. 28 పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్లైన్లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.  పోస్టులు: సైంటిఫిక్ ఆఫీస‌ర్‌, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస‌ర్, జూనియ‌ర్ ఇంజినీర్‌, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, ట్రేడ్స్‌మెన్‌, క్లర్క్,  వ‌ర్క్ అసిస్టెంట్‌, ప్రాజెక్ట్ సైంటిఫిక్ ఆఫీస‌ర్ త‌దిత‌రాలు; అర్హత‌: ప‌దోత‌ర‌గ‌తి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఈ/ బీటెక్‌/ఎంఎస్సీ, మాస్టర్స్ డిగ్రీ, ఎంబీబీఎస్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణత‌తో పాటు పని అనుభ‌వం; సెలెక్షన్ ప్రాసెస్: ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ ద్వారా;
చివ‌రి తేది: 2020 జులై 23; వివరాలకు: www.tifr.res.in

టీఐఎఫ్ఆర్‌, హైద‌రాబాద్‌లో..‌

Advertisement

హైద‌రాబాద్‌లోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండ‌మెంట‌ల్ రిసెర్చ్ (టీఐఎఫ్ఆర్‌).. 10 పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్లైన్లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. పోస్టులు: సైంటిఫిక్ ఆఫీస‌ర్‌/అసిస్టెంట్, ఇంజినీర్‌, ప్రాజెక్టు సైంటిఫిక్ ఆఫీస‌ర్‌/అసిస్టెంట్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, క్లర్క్; అర్హత‌: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ బీఎస్సీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత‌తో పాటు పని అనుభ‌వం; సెలెక్షన్ ప్రాసెస్: రాత‌ప‌రీక్ష/ ఇంట‌ర్వ్యూ ద్వారా;
చివ‌రి తేది: 2020 జులై 29; వివరాలకు: www.tifr.res.in

ఆర్మీ డెంట‌ల్ కాఫ్స్-లో 43 ఆఫీస‌ర్లు

ఇండియ‌న్ ఆర్మీకి చెందిన ఆర్మీ డెంట‌ల్ కార్ప్స్లో 43 షార్ట్ స‌ర్వీస్ కంబైన్డ్ ఆఫీసర్ పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ద‌ర‌ఖాస్తుకు అర్హులే. అర్హత‌: బీడీఎస్‌/ఎండీఎస్ ఉత్తీర్ణత‌తో పాటు ఏడాది వ్యవధి గల రొటేట‌రీ ఇంట‌ర్న్‌షిప్  చేసి ఉండాలి. వ‌య‌సు: 2020 డిసెంబర్ 31 నాటికి 45 ఏళ్లు మించ‌కూడదు; సెలెక్షన్ ప్రాసెస్: నీట్‌(ఎండీఎస్)–2020 మార్కుల ఆధారంగా; ఫీజు: రూ.200;
చివ‌రి తేది: 2020 జులై 30; వివరాలకు: www.joinindianarmy.nic.in

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!