గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న గెయిల్ వర్క్ సెంటర్లు/ యూనిట్‌లలో 391 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ కోరుతోంది.
అర్హతలు: పోస్టును అనుసరించి పదోతరగతి, పన్నెండో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, సీఏ/ ఐసీడబ్ల్యూఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ, బీబీఎస్, బీబీఎం, బీఈ, బీటెక్, ఎమ్మె్స్సీ, ఎంకాం, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్, ట్రేడ్/ స్కిల్ టెస్ట్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. జూనియర్ ఇంజినీర్ పోస్టులకు రూ.35,000- నుంచి 1,38,000. జూనియర్ సూపరింటెండెంట్, జూనియర్ కెమిస్ట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులకు రూ.29,000- నుంచి రూ.1,20,000. మిగిలిన పోస్టులకు రూ.24,500- నుంచి రూ.90,000 జీతం చెల్లిస్తారు.
అప్లికేషన్స్: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో సెప్టెంబర్ 7వరకు దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు రూ.50 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. పూర్తి వివరాలకు www.gailonline.com వెబ్సైట్లో సంప్రదించాలి.