తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TGTET-JUNE-2026) కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాష్ట్ర విద్యాశాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. టీజీటెట్ ఆన్‌లైన్ పరీక్షలు జూన్ 16 నుంచి జూన్ 22 వరకు మొత్తం 5 రోజుల పాటు 10 సెషన్లలో నిర్వహించనున్నట్లు ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్, టీజీటెట్ కన్వీనర్ తెలిపారు. ప్రతిరోజూ రెండు సెషన్లలో ఉదయం 9.00 గంటల నుంచి 11.30 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2.00 గంటల నుంచి 4.30 గంటల వరకునిర్వహిస్తారు.
జూన్ 16, 17 తేదీలలో పేపర్-1 (తెలుగు/ఇంగ్లీష్ మీడియం) పరీక్షలు, జూన్ 18న పేపర్-2 గణితం అండ్ సైన్స్, జూన్ 19న పేపర్-2 సోషల్ స్టడీస్ పరీక్షలు నిర్వహించనున్నారు. జూన్ 22న మైనారిటీ భాషల అభ్యర్థులకు ప్రత్యేకంగా పేపర్-1, పేపర్-2 పరీక్షలు నిర్వహించనున్నారు.
పేపర్-1 (ఇంగ్లీష్/తెలుగు మీడియం) పరీక్ష కేంద్రాలు…
ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, మెదక్, ములుగు, నల్గొండ, నారాయణపేట, జనగాం, కరీంనగర్, ఖమ్మం, కుమురం భీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.
పేపర్-2 (గణితం అండ్ సైన్స్) పరీక్ష కేంద్రాలు…
హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, మెద్చల్-మల్కాజిగిరి, నాగర్‌కర్నూల్, నిర్మల్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వనపర్తి, వరంగల్ జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.
పేపర్-2 (సోషల్ స్టడీస్) పరీక్ష కేంద్రాలు
ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, హైదరాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, మంచిర్యాల, మెదక్, ములుగు, నాగర్‌కర్నూల్, పెద్దపల్లి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి తదితర జిల్లాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.
మైనారిటీ భాషల అభ్యర్థులకు..
హిందీ, కన్నడ, తమిళం, ఉర్దూ, మరాఠీ, బెంగాలీ, సంస్కృతం భాషల్లో రాసే అభ్యర్థులకు జూన్ 22న జరిగే పరీక్షలు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నిర్వహించబడతాయని టెట్ కన్వీనర్ పేర్కొన్నారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్. https://schooledu.telangana.gov.in సంప్రదించండి.





