తెలంగాణ ఇన్-సర్వీస్ టీచర్ల కోసం పాఠశాల విద్యాశాఖ ‘TGTET ఇన్-సర్వీస్ టీచర్స్-2026’ ప్రకటనను విడుదల చేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఉద్యోగంలో కొనసాగాలన్నా, ప్రమోషన్లు పొందాలన్నా టెట్ తప్పనిసరి కావడంతో ప్రభుత్వం ఈ ప్రత్యేక పరీక్షను అందుబాటులోకి తెచ్చింది. సాధారణ టెట్లతో పాటు ఇన్-సర్వీస్ టీచర్ల కోసం వీటిని నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ, స్థానిక సంస్థలు, మోడల్, సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు మాత్రమే దీనికి అర్హులు. అయితే.. ఈ స్కోరు భవిష్యత్తు డీఎస్సీ (DSC) ప్రత్యక్ష నియామకాలకు చెల్లదని అధికారులు స్పష్టం చేశారు.
పరీక్ష విధానం & విభాగాలు:
ఈ పరీక్షను కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ పద్ధతిలో నిర్వహిస్తారు. ప్రతి పేపర్లో 150 మార్కులకు గాను 150 ఆబ్జెక్టీవ్ టైప్ ఉంటాయి. ఇందులో నెగెటివ్ మార్కులు ఉండవు.
పేపర్-1: 1 నుంచి 5 తరగతులకు బోధించే ఎస్జీటీ (SGT)లు, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు రాయాలి.
పేపర్-2: 6 నుంచి 8 తరగతుల ఉపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు, టీజీటీలు, లాంగ్వేజ్ పండిట్లు, హైస్కూల్ హెచ్ఎంలు హాజరు కావాలి.
అర్హత మార్కులు :
పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి కేటగిరీల వారీగా కనీస మార్కులు.
ఓపెన్ కేటగిరీ / ఈడబ్ల్యూఎస్: 60% లేదా అంతకంటే ఎక్కువ మార్కులు ఉండాలి.
బీసీ వర్గాలు: 50% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేయాలి.
ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగులు: 40% లేదా అంతకంటే ఎక్కువ మార్కులు తప్పనిసరి.
పరీక్ష ఫీజు వివరాలు:
జనరల్, ఓబీసీ అభ్యర్థులు ఒక పేపర్‌కు రూ. 750, రెండు పేపర్లకు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది.
ఎస్సీ,ఎస్టీ,ఓబీసీ పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఒక పేపర్‌కు రూ.700, రెండు పేపర్లకు రూ.950 చెల్లించాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ అప్లికేషన్లు : జులై 22 నుంచి జులై 29 వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
హాల్ టికెట్ల డౌన్లోడ్: ఆగస్టు 31 నుంచి అధికారిక వెబ్ సైట్ లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంచుతారు.
పరీక్ష తేదీలు: సెప్టెంబర్ 07 నుంచి 11 వరకు (రోజుకు రెండు షిఫ్టుల్లో: ఉదయం 9.00 – 11.30, మధ్యాహ్నం 2.00 – 4.30)పరీక్షలు నిర్వహిస్తారు.
రిజల్ట్ : సెప్టెంబర్ 28 నుంచి 30 మధ్య రిజల్ట్ ప్రకటించే అవకాశం ఉంది.
అధికారిక వెబ్సైట్:
అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్schooledu.telangana.gov.in ద్వారా అప్లై చేసుకోవచ్చు.





