తెలంగాణ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్–2026 డిటైల్డ్ నోటిఫికేషన్ను విద్యాశాఖ విడుదల చేసింది. ప్రతియేటా రెండు సార్టు టెట్ పరీక్ష నిర్వహించాల్సి ఉండగా.. ఈ ఏడాది రెండో విడత టెట్ పరీక్షకు రేపటి నుంచి (నవంబర్ 15) దరఖాస్తులు స్వీకరించనుంది. టెట్–2026 అర్హతల్లో కీలక మార్పులు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. సర్వీస్ టీచర్లకు టెట్ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించింది.
టీజీ టెట్–2026 ముఖ్యమైన తేదీలు
టెట్ నోటిఫికేషన్ తేదీ: 14.11.2025
టెట్ అప్లికేషన్లు ప్రారంభం: 15.11.2025
అప్లికేషన్లకు చివరి గడువు: 29.11.2025
హాల్ టికెట్ల డౌన్లోడ్ : 27.12.2025
పరీక్ష తేదీలు : జనవరి 03 నుంచి 31 వరకు
టెట్ ఫలితాల వెల్లడి: ఫిబ్రవరి 10 నుంచి 16 లోపు
టీజీ టెట్ –2026 అర్హతలు
టెట్ పరీక్ష రాసేందుకు అర్హతల్లో విద్యాశాఖ కీలక మార్పులు చేసింది. గతంలో ఇంటర్, డిగ్రీ అర్హత మార్కులు 45 శాతం ఉండగా దానికి 50 శాతానికి పెంచింది. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం నుంచి 45శాతానికి పెంచింది. మరోవైపు సర్వీస్ టీచర్లకు టెట్ రాసేందుకు విద్యాశాఖ అర్హత కల్పించింది.
- పేపర్–1 రాసేందుకు ఇంటర్లో 50 శాతం మార్కులతో పాటు డిఈడీ లేదీ డీఎల్ఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.
మరియు బీఈడీ లేదా డీఈడీ అర్హత ఉండి.. ఎస్టీజీ, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులు పేపర్–1 రాసేందుకు అర్హులు. - పేపర్ –2 రాసేందుకు డిగ్రీలో 50 శాతం మార్కులతో పాటు బీఈడీ ఉత్తీర్ణత తప్పనిసరి. మరియు బీఈడీ అర్హతతో స్కూల్ అసిస్టెంట్ టీచర్లు, లాంగ్బేజ్ పండిట్లుగా పనిచేస్తున్న వారు పేపర్–2కు రాసేందుకు అర్హులు. (ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు టెట్ అవసరం లేదు.)
దరఖాస్తు ప్రక్రియ ఇలా..
పై అర్హతలున్న అభ్యర్థులు రేపటి నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. పేపర్–1 లేదా పేపర్–2 రాసేందుకు రూ.750 ఫీజు చెల్లించాలి. పేపర్–1 పేపర్–2 రెండూ రాసేవారు రూ.1000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసేందుకు నవంబర్ 29 చివరితేది. అప్లికేషన్లు https://schooledu.telangana.gov.in/SCHOOLEDUCATION/ వెబ్సైట్లో దరఖాస్తులు సబ్మిట్ చేయాలి.
పరీక్షా విధానం
గతంలో మాదిరిగానే టెట్ పరీక్ష 150 మార్కులకు నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. నెగిటివ్ మార్కులు ఉండవు. కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఉంటుంది.
పేపర్ –1 రాసే వారికి చైల్డ్ డెవలప్మెంట్ –30 మార్కులు, తెలుగు లాంగ్వేజ్ –30 మార్కులు, ఇంగ్లీష్ లాంగ్వేజ్–30 మార్కులు, మ్యాథ్స్–30 మార్కులు, ఎన్విరాన్మెంటల్ సైన్స్–30 మార్కులు కేటాయిస్తారు.
పేపర్–2 రాసేవారికి చైల్డ్ డెవలప్మెంట్–30 మార్కులు, లాంగ్వేజ్–1 30 మార్కులు, లాంగ్వేజ్–2, 30 మార్కులు, బీఈడీలో మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టుల వారికి సైన్స్ మరియు మ్యాథ్స్ కలిపి –60 మార్కులు, సోషల్ స్టడీస్ వారికి సోషల్ స్టడీస్ నుంచి 60 మార్కులు కేటాయిస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. నెగిటీవ్ మార్కులు ఉండవు.
పరీక్ష రాసేందుకు 2.30 గంటల సమయం ఇస్తారు. ఉదయం సెషన్ 9.00 నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం సెషన్ 2.00 నుంచి సాయంత్రం 4.30 వరకు ఉంటుంది.
మరింత సమాచారం కోసం టెట్ ఇన్ఫర్మేషన్ బులిటెన్ పీడీఎఫ్ చూడండి .





