తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG SET 2025)కు సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ వివరాలను ఎంటర్ చేసి అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించే సెట్ పరీక్షలకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. డిసెంబర్ 22 నుంచి 24 వరకు మూడు రోజుల పాటు రెండు షిఫ్టులలో పరీక్షలు జరుగుతాయి. రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీలు లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులకు అర్హత పొందడానికి టీజీ సెట్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
పరీక్షల షెడ్యూల్:
పరీక్షలు డిసెంబర్ 22 నుంచి 24 వరకు మూడు రోజుల పాటు రెండు షిఫ్టులలో జరుగుతాయి.
మొదటి రోజు (ఉదయం): జాగ్రఫీ, జర్నలిజం, సంస్కృతం, హిందీ, లైఫ్ సైన్సెస్.
మొదటి రోజు (మధ్యాహ్నం): ఉర్దూ, తెలుగు, ఎడ్యుకేషన్, లింగ్విస్టిక్స్.
పరీక్షా విధానం: మొత్తం రెండు పేపర్లు ఉంటాయి.
పేపర్- 1: 50 ప్రశ్నలు – 100 మార్కులు.
పేపర్- 2: 100 ప్రశ్నలు – 200 మార్కులు.
రెండు పేపర్లు కూడా ఆబ్జెక్టివ్ తరహాలోనే ఉంటాయి. పరీక్షా సమయం మొత్తం 3 గంటలు ఉంటుంది.
హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకునే విధానం:
1.మొదట అధికారిక వెబ్‌సైట్ www.telanganaset.org ను ఓపెన్ చేయండి.
2.హోమ్ పేజీలో “Download TG SET Hall Ticket 2025” అనే లింక్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
- ఇప్పుడు ఒక కొత్త లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది. మీ అప్లికేషన్ నంబర్ ఎంటర్ ,పేమెంట్ ఐడీ, మొబైల్ నంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేయండి.
- వివరాలన్నీ చెక్ చేసిన తర్వాత “Submit” లేదా “Get Hall Ticket” బటన్‌పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీ హాల్ టికెట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. దానిని డౌన్‌లోడ్ చేసుకుని.. ప్రింట్ అవుట్ తీసుకోండి.
సూచనలు:
పరీక్షా కేంద్రానికి వెళ్లేటప్పుడు హాల్ టికెట్‌తో పాటు ఒక ఒరిజినల్ ఐడెంటిటీ కార్డు (ఆధార్ లేదా ఓటర్ ఐడీ) తప్పనిసరిగా తీసుకెళ్లాలి. పరీక్ష సమయానికి కనీసం ఒక గంట ముందే కేంద్రానికి చేరుకోవడం ఉత్తమం.





