HomeJOBSటీజీఆర్‌జేసీ సెట్‌కు అప్లై చేశారా ?

టీజీఆర్‌జేసీ సెట్‌కు అప్లై చేశారా ?

తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ (TREIS) ఆధ్వర్యంలో నిర్వహించే TGRJC CET-2026 అప్లికేషన్ గడువు ముగియనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 35 రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లకు ఈ పరీక్ష.. నిర్వహిస్తున్నారు. రేపటితో (ఏప్రిల్ 15) అప్లికేషన్ ప్రక్రియ ముగియనుంది కాబట్టి, ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

టీజీఆర్ జేసీ సెట్-2026: అడ్మిషన్ల పూర్తి వివరాలు

తెలంగాణలోని ప్రతిభావంతులైన గ్రామీణ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ గురుకుల కాలేజీలను నిర్వహిస్తోంది.

MPC (Mathematics, Physics, Chemistry)

BiPC (Biology, Physics, Chemistry)

MEC (Mathematics, Economics, Commerce)

అప్లకేషన్ అర్హతలు:
విద్యార్హత:
అభ్యర్థులు 2025-26 విద్యా సంవత్సరంలో టెన్త్ (SSC) పరీక్షలకు హాజరై ఉండాలి. మొదటి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి.

నివాసం: అభ్యర్థి తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి.

ఆదాయ పరిమితి: విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 2.00 లక్షలకు మించకూడదు.

పరీక్షా సరళి:
ప్రవేశ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో (OMR Based) ఉంటుంది. టెన్త్ సిలబస్ ఆధారంగా ప్రశ్నలు అడుగుతారు.

మొత్తం మార్కులు: 150

సమయం: 2 గంటల 30 నిమిషాలు

ఒక్కో గ్రూపునకు సంబంధించి నిర్ణీత సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఉదాహరణకు.. MPC విద్యార్థులకు ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ నుంచి ప్రశ్నలు ఉంటాయి.

అప్లికేషన్ విధానం:
ఆసక్తి గల విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా రూ. 200 అప్లికేషన్ ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ఫోటో, సంతకం స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here