గ్రూప్ 4 పోస్టుల కు ఎంపికైన అభ్యర్థుల జాబితా ను టీజీపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 8084 మంది సెలక్టెడ్ అభ్యర్థుల జాబితాను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. ప్రజా పాలన తొలి ఏడాది విజయోత్సవాల్లో భాగంగా వీరికి నియామక పత్రాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.