HomeLATESTగ్రూప్​ 3 హాల్ టికెట్లు రెడీ.. డౌన్​లోడ్ చేసుకొండి​

గ్రూప్​ 3 హాల్ టికెట్లు రెడీ.. డౌన్​లోడ్ చేసుకొండి​

గ్రూప్​ 3 హాల్​ టికెట్లను టీజీపీఎస్​సీ వెబ్​సైట్​లో అందుబాటులో ఉంచింది. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూలు ప్రకారం నవంబరు 17, 18 తేదీల్లో గ్రూప్​ 3 రాత పరీక్షలు జరుగనున్నాయి. నవంబరు 17వ తేదీ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. నవంబరు 18న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-3 పరీక్ష ఉంటుంది. ఉదయం జరిగే పరీక్షలకు 9.30 తర్వాత, మధ్యాహ్నం జరిగే పరీక్షకు 2.30 అనంతరం పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోమని ఇప్పటికే టీజీపీఎస్​సీ స్పష్టం చేసింది.

అభ్యర్థులు ​ డౌన్​లోడ్ చేసుకున్న హాల్​ టికెట్​ కాపీని భద్రంగా పెట్టుకోవాలని, తొలిరోజు పేపర్-1 పరీక్షకు ఉపయోగించిన హాల్​ టికెట్​ను మిగతా పరీక్షలకు ఉపయోగించాలని కమిషన్ కార్యదర్శి డాక్టర్ నవీన్​ నికోలస్​ తెలిపారు. ప్రశ్నపత్రాలు, హాల్ టికెట్లను నియామక ప్రక్రియ ముగిసేవరకు భద్రంగా పెట్టుకో వాలని సూచించారు.

హాల్ టికెట్లు డౌన్​ లోడ్​ చేసుకునేటప్పుడు ఏమైనా సాంకేతిక ఇబ్బందులు ఉంటే.. పనిదినాల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 040-23542185, 040-23542187 ఫోన్ నంబర్లలో సంప్రదించాలి.
నోట్: హాల్​ టికెట్లు డౌన్​లోడ్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్​ ఇక్కడ అందుబాటులో ఉంది.

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!