HomeLATESTగ్రూప్​ 1 అభ్యర్థులకు అలర్ట్.. 24న ఫైనల్​ కీ

గ్రూప్​ 1 అభ్యర్థులకు అలర్ట్.. 24న ఫైనల్​ కీ

గ్రూప్​ 1 పరీక్షకు సంబంధించి తెలంగాణ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ (TGPSC) మరో కీలక ప్రకటన విడుదల చేసింది. ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన ఓఎంఆర్​ ఆన్సర్​ షీట్లను ఈనెల 24 నుంచి వెబ్​సైట్​లో అందుబాటులో ఉంచుతామని ప్రకటన విడుదల చేసింది. పరీక్ష రాసిన అభ్యర్థులందరూ తమ ఆన్సర్​ షీట్లను డౌన్​ లోడ్​ చేసుకునే అవకాశముంటుంది. టీఎస్​పీఎస్​సీ వెబ్​సైట్​లో తమ ఐడీ నెంబర్​, హాల్​ టికెట్​ నెంబర్​, పుట్టిన తేదీ నమోదు చేసి స్కాన్​ చేసిన ఓఎంఆర్​ షీట్లను డౌన్​ లోడ్​ చేసుకోవాల్సి ఉంటుంది.

ఇటీవలే గ్రూప్​ 1 ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని టీజీపీఎస్​సీ విడుదల చేసింది. 24వ తేదీన ఓఎంఆర్​ ఆన్సర్​ షీట్లతో పాటు ఫైనల్​ కీ ని కూడా విడుదల చేసే అవకాశాలున్నాయి. దీంతో అభ్యర్థులందరూ తమకు ఎన్ని మార్కులు వస్తాయో అంచనా వేసుకునే వీలుంటుంది. 563 పోస్టుల భర్తీకి జూన్​ 9వ తేదీన గ్రూప్​ 1 పరీక్ష నిర్వహించింది. 403667 మంది అభ్యర్థులు ఈ నోటిఫికేషన్​కు దరఖాస్తు చేసుకున్నారు. 302172 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. గత ప్రభుత్వం నిర్వహించిన రెండు సార్లు రద్దయిన విషయం తెలిసిందే. ఈసారి టీజీపీఎస్​సీ పరీక్షను ప్రశాంతంగా నిర్వహించటంతో పాటు ఫలితాల వెల్లడిలోనూ పక్కాగా వ్యవహరిస్తున్న తీరు అభ్యర్థుల ప్రశంసలను అందుకుంటోంది.

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!