డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్ విభాగంలోని డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్స్ గ్రేడ్ -2 పోస్టుల జనరల్ ర్యాంకింగ్ లిస్టు (జీఆర్ఎల్)ను టీజీపీఎస్సీ (TGPSC) విడుదల చేసింది. జీఆర్ ఎల్ తోపాటు ఫైనల్ కీని సైతం విడుదల చేసింది. జూన్ 30, జూలై 4న డీఏవో ఉద్యోగాల భర్తీకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ను నిర్వహించారు. జూలై 31న ప్రాథమిక కీని విడుదల చేయగా, తాజాగా శనివారం ఫైనల్ తో పాటు జనరల్ ర్యాంకింగ్ లిస్టును వెబ్సైట్లో పొందు పరిచింది.