HomeLATESTగ్రూప్​ 4 మెరిట్​ లిస్ట్ చెక్​ చేసుకొండి.. 13 నుంచి వెబ్​ ఆప్షన్లు

గ్రూప్​ 4 మెరిట్​ లిస్ట్ చెక్​ చేసుకొండి.. 13 నుంచి వెబ్​ ఆప్షన్లు

గ్రూప్​ 4 పరీక్ష ఫలితాల మెరిట్​ లిస్ట్ విడుదలైంది. రాష్ట్రంలో 8,180 గ్రూప్‌-4 పోస్టుల భర్తీకి ఎంపికైన మెరిట్​ అభ్యర్థుల జాబితాను తెలంగాణ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులందరూ ఈనెల 13 నుంచి వెబ్‌ ఆప్షన్స్‌ నమోదు చేసుకోవాలని ప్రకటన జారీ చేసింది. ధ్రువపత్రాల పరిశీలన తేదీలను త్వరలోనే వెబ్​సైట్​ లో అందుబాటులో ఉంచుతామని తెలిపింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్​కు వచ్చే అభ్యర్థులు తప్పనిసరిగా వెబ్‌ ఆప్షన్స్‌ నమోదు చేసుకోవాలని సూచించింది. వారిని మాత్రమే విడతల వారీగా ధ్రువపత్రాల పరిశీలనకు అనుమతించనుంది. అభ్యర్థులు వెరిఫికేషన్‌కు హాజరుకావాల్సిన రోజువారీ తేదీలను కమిషన్‌ వెబ్‌సైట్‌లో త్వరలోనే అందుబాటులో ఉంచుతుంది. గత ఏడాది జరిగిన ఈ పరీక్షకు సంబంధించి ఫిబ్రవరి 9వ తేదీన గ్రూప్​ 4 జనరల్‌ ర్యాంకుల జాబితాను టీజీపీఎస్‌సీ ప్రకటించింది.

అభ్యర్థులందరూ తీసుకురావాల్సిన సర్టిఫికెట్లు

1. ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు స్టడీ/నివాస ధ్రువీకరణ పత్రం
2. కుల ధ్రువీకరణ పత్రం
3. బీసీ నాన్‌ క్రీమీలేయర్ సర్టిఫికెట్.
4. దివ్యాంగులకు ధ్రువీకరణ పత్రం
5. ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులైతే 2021-22 ఈడబ్ల్యూఎస్‌ ధ్రువీకరణ పత్రం

ధ్రువీకరణ పత్రాల పరిశీలన సమయంలో తప్పనిసరిగా ఈ పత్రాలన్నీ సమర్పించాల్సి ఉంటుంది. సర్టిఫికెట్ల విషయంలో అభ్యర్థులకు అదనపు గడువు ఇవ్వబోమని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది.

గత ఏడాది 2023 జులై 1వ తేదీన టీఎస్​పీఎస్​సీ గ్రూప్-4 పరీక్ష జరిగింది. మొత్తం 8180 గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన ఈ పరీక్షకు 9.12 లక్షల మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. వీరిలో 80 శాతం మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. 7,62,872 మంది అభ్యర్థులు పేపర్​ 1 పరీక్షకు అటెండయ్యారు. మధ్యాహ్నం జరిగిన పేపర్​ 2కు 7.61,198 మంది హాజరయ్యారు. వీరికి వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్​ లిస్ట్ ను టీజీపీఎస్​సీ విడుదల చేసింది.

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!