తెలంగాణ గ్రూప్ 3 అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ షెడ్యూలు విడుదలైంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) కీలక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే టీజీపీఎస్సీ గ్రూప్ 3 ఫలితాలను విడుదల చేసింది. జనరల్ ర్యాంకింగ్ జాబితాను (GRL) ప్రకటించింది. ఇప్పుడు సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలను ప్రకటించింది.
నవంబర్ 10వ తేదీ నుంచి ఈనెల 26 వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని టీజీపీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు నాంపల్లి పబ్లిక్‌గార్డెన్‌లోని సురవరం ప్రతాప్‌రెడ్డి యూనివర్సిటీలో(గతంలో పొట్టి శ్రీరాములు యూనివర్శిటీ) ధ్రువీకరణ పత్రాల పరిశీలన జరుగుతుంది. గ్రూప్-3కి ఎంపికైన అభ్యర్థులు తమ ధ్రువ పత్రాలతో నిర్ణీత షెడ్యూలు ప్రకారం ఈ వెరిఫికేషన్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. ధ్రువపత్రాల పరిశీలన రోజువారీ షెడ్యూలుతో పాటు ఎంపికైన అభ్యర్థుల హాల్ టికెట్ల వివరాలను టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ https://www.tgpsc.gov.in లో అందుబాటులో ఉంచింది.
1365 గ్రూప్ 3 పోస్టుల భర్తీకి గతేడాది నవంబర్ 17, 18 తేదీల్లో టీజీపీఎస్సీ పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షలకు 50.24శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీటికి సంబంధించిన ప్రాథమిక కీలను విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించారు. ఈ ఏడాది మార్చిలో ఫలితాలను (జనరల్ ర్యాంకింగ్ లిస్ట్) ప్రకటించారు. అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తర్వాత… నియామకపత్రాలను అందజేసేందుకు టీజీపీఎస్సీ సన్నాహాలు చేస్తోంది.
టీజీపీఎస్సీ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం… అభ్యర్థులు వెరిఫికేషన్ కు హాజరుకావాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో పాటు రెండు సెట్లు స్వయంగా సంతకం చేసిన ఫొటో కాపీలు వెంట తీసుకురావాలని సూచించింది.
- అభ్యర్థులు సమర్పించాల్సిన పత్రాలు
- అప్లికేషన్ ఫామ్
- హాల్ టికెట్
- ఆధార్ కార్డు లేదా ఓటర్ కార్డు లేదా పాస్ పోర్ట్/ డ్రైవింగ్ లైసెన్స్/ సర్వీస్ ఐడీ కార్డ్స్, పాన్ కార్డు
- విద్యా అర్హత పత్రాలు పదో తరగతి మెమో
- ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు
- రెసిడెన్సీ సర్టిఫికెట్లు
- స్పోర్ట్స్ రిజర్వేషన్ ఉంటే ధ్రువీకరణ పత్రాలు
- కుల ధ్రువీకరణ పత్రం
- ఈడబ్యూఎస్ అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్ సమర్పించాలి.
- దివ్యాంగ అభ్యర్థులు – సంబంధిత సర్టిఫికెట్లు ఇతర ధ్రువపత్రాలు







