గ్రూప్-2 పోస్టుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఈ రోజు నుంచి కొనసాగుతుంది. సెప్టెంబర్ 13వ తేదీ నుంచి మూడో విడత సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) ప్రకటించింది. సెప్టెంబరు 13 నుంచి నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌లోని సురవరం ప్రతాప్‌రెడ్డి యూనివర్సిటీలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన కొనసాగుతుంది. అభ్యర్థులు ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు హాజరయ్యాక సమర్పించాల్సిన పత్రాలు ఇంకా ఏమైనా పెండింగ్‌లో ఉంటే రిజర్వు డే రోజున సమర్పించేందుకు వీలు కల్పించింది. సెప్టెంబరు 15వ తేదీని రిజర్వుడ్ డేగా ప్రకటించింది. ఆ రోజున పెండింగ్‌లో ఉన్న సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది. మొత్తం 783 పోస్టులకు గ్రూప్-2 రిక్రూట్మెంట్ చేపట్టిన విషయం తెలిసిందే. ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితా టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ https://www.tgpsc.gov.in లో అందుబాటులో ఉంది.







