గ్రూప్ 2 పరక్షల హాల్ టికెట్లను టీజీపీఎస్సీ సిద్ధం చేసింది. డిసెంబర్ 9వ తేదీ నుంచి వీటిని వెబ్సైట్ లో అందుబాటులో ఉంచుతామని టీజీపీఎస్సీ ప్రకటన జారీ చేసింది. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూలు ప్రకారం డిసెంబర్ 15, 16 తేదీల్లో రాత పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగవంతం చేసింది. అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్ కాపీని భద్రంగా పెట్టుకోవాలని, తొలిరోజు పేపర్-1 పరీక్షకు ఉపయోగించిన హాల్ టికెట్‌ను మిగతా పరీక్షలకు ఉపయోగించాలని టీజీపీఎస్సీ ప్రకటించింది. హాల్ టికెట్లను నియామక ప్రక్రియ ముగిసేవరకు భద్రంగా పెట్టుకో వాలని సూచించారు. హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునేటప్పుడు ఏమైనా సాంకేతిక ఇబ్బందులు ఉంటే.. టీజీపీఎస్సీ హెల్ప్ లైన్ నెంబర్లను సంప్రదించాలి.
నోట్: హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్ ఇక్కడ అందుబాటులో ఉంది. డిసెంబర్ 9 తేదీ నుంచి హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి.
I want to download hall ticket but its is not get download
SIR, TSPSC Group 2 and Rrb Je Exams on same date. 16/12/24.