గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష రాసిన అభ్యర్థుల ఓఎంఆర్ పత్రాల స్కానింగ్ ప్రక్రియ పూర్తయింది. ఈ పరీక్ష రాసిన అభ్యర్థుల ఓఎంఆర్ ఇమేజింగ్ పత్రాలు ఈ రోజు 5 గంటల నుంచి www.tspsc.gov.in వెబ్సైట్ లో అందుబాటులో ఉంచామని టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ పేర్కొన్నారు. అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్‌లో వివరాలు నమోదు చేసి వాటిని పొందవచ్చని సూచించారు.
రాష్ట్రంలో జూన్ 9న నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు 3,02,172 మంది అభ్యర్థులు హాజరయ్యారని టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. 563 పోస్టులతో కూడిన గ్రూప్-1 ఉద్యోగ ప్రకటనకు 4,03,667 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా.. 74.86 శాతం మంది పరీక్షకు హాజరయ్యారని నవీన్ నికోలస్ ప్రకటించారు. అత్యధికంగా వనపర్తిలో 82.74 హాజరు శాతం, అత్యల్పంగా హైదరాబాద్‌లో 61.78 శాతం నమోదైందని తెలిపారు.