గ్రూప్ -1 మెయిన్స్ (TGPSC GROUP 1) పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 9వ తేదీన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ముగిసింది. ఈ పరీక్ష ముగియటంతో మెయిన్స్ పరీక్షల షెడ్యూలును తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. అక్టోబర్ 21వ తేదీ నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నట్లు షెడ్యూల్‌ను విడుదల చేసింది. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ మీడియంలలో మెయిన్స్ పరీక్షలు నిర్వహించనుంది.
మెయిన్స్ పరీక్షల షెడ్యూల్
- అక్టోబర్ 21 – జనరల్ ఇంగ్లీష్(క్వాలిఫయింగ్ టెస్ట్),
- అక్టోబర్ 22 – పేపర్ 1(జనరల్ ఎస్సే),
- అక్టోబర్ 23 – పేపర్ 2(హిస్టరీ, కల్చర్ అండ్ జియోగ్రఫీ),
- అక్టోబర్ 24 – పేపర్ 2 (ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం అండ్ గవర్నెన్స్),
- అక్టోబర్ 25 – పేపర్ 4(ఎకానమి అండ్ డెవలప్‌మెంట్),
- అక్టోబర్ 26 – పేపర్ 5(సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డాటా ఇంటర్‌ప్రిటేషన్),
- అక్టోబర్ 27 – పేపర్ 6(తెలంగాణ మూవ్‌మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్)
ప్రతి పేపర్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించనున్నారు.