HomeLATESTగ్రూప్‌-1 మెయిన్స్‌ హాల్‌టికెట్లు.. డౌన్​లోడ్​ చేసుకొండి ​

గ్రూప్‌-1 మెయిన్స్‌ హాల్‌టికెట్లు.. డౌన్​లోడ్​ చేసుకొండి ​

ఈనెల 21 నుంచి 27 వరకు జరగనున్న గ్రూప్​ 1 మెయిన్స్​ హాల్​టికెట్లను తెలంగాణ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ (TGPSC) అక్టోబరు 14న (సోమవారం) విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో అవసరమైన వివరాలను అందించి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఈ హాల్‌టికెట్లు పరీక్ష తేదీకి ఒకరోజు ముందు వరకు అందుబాటులో ఉంటాయని టీజీపీఎస్​సీ వెల్లడించింది. హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే సమయంలో సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ లేదా కమిషన్ అధికారులను సంప్రదించాలి. హాల్​ టికెట్ల కోసం www.hallticket.tspsc.gov.in వెబ్​సైట్​లో చూసుకోవాలి.

మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పరీక్ష

గ్రూప్‌-1 ప్రధాన పరీక్షలు హైదరాబాద్‌ కేంద్రంగా (హెచ్‌ఎండీఏ పరిధిలో) మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు జరుగుతాయని తెలిపింది. తొలిరోజు ఉపయోగించిన హాల్‌టికెట్‌తోనే మిగతా పరీక్షలకు రావాలని సూచించారు. అభ్యర్థులను మధ్యాహ్నం 12:30 నుంచి అనుమతిస్తామని, 1:30 గంటలకు గేట్లు మూసివేస్తామని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 1:30గంటల తరువాత ఎట్టిపరిస్థితుల్లో అనుమతించబోమని స్పష్టం చేశారు. అక్టోబర్ 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించేదుకు టీజీపీఎస్​సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గ్రూప్‌-1 మెయిన్స్‌కు 31,382 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!