గ్రూప్ 1 మెయిన్స్‌కు సెలెక్ట్ అయిన వారి వివరాలు వెల్లడయ్యాయి. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కు ఏ కేటగిరీకి చెందిన వారు ఎంతమంది క్వాలిఫై అయ్యారనే వివరాలను టీజీపీఎస్సీ ప్రకటించింది. ఈ నెల 21న ప్రారంభమైన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు ఆదివారం ముగిశాయి. రాష్ట్రంలో మొత్తం 563 పోస్టులకు గ్రూప్1 నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 31,383 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించారు. మరో 20 మంది స్పోర్ట్స్ క్యాండిడేట్లు పరీక్ష రాసేందుకు ప్రత్యేకంగా కోర్టు నుంచి అనుమతి పొందారు. అయితే, మొత్తం వారం రోజుల పాటు కేవలం 21,093 (67.17%) మంది మాత్రమే పరీక్షలకు అటెండ్ అయ్యారు.
- ఒక్కో పోస్టుకు 1: 50 రేషియోలో గ్రూప్ 1 మెయిన్స్‌కు మొత్తం 31,383 మంది క్వాలిఫై అయ్యారు. వీరిలో ఓసీలు 3,076 మంది ఉన్నారు.
- అత్యధికంగా బీసీలు17,921 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. ఎస్సీలు 4,828 మంది, ఎస్టీలు 2,783 మంది, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 2,774 మంది క్వాలిఫై అయ్యారు. పీడబ్ల్యూడీ కేటగిరీలో మెయిన్స్‌కు 1,299 మందిని ఎంపిక చేశారు.
- పరీక్ష రాసిన వారిలో ఒపెన్ కేటగిరీలో 2384 మంది అభ్యర్థులున్నారు.
అన్ రిజర్వుడు కేటగిరీలో ఉన్న 209 పోస్టుల్లో ఒక్కో పోస్టుకు సగటున 100.92 మంది పోటీపడుతున్నారు. ఈడబ్ల్యుఎస్ కేటగిరీలో ఒక్కో పోస్టుకు 36.29 మంది పోటీపడుతున్నారు. - అత్యధికంగా బీసీ(డి)లో ఒక్కో పోస్టుకు 174 మంది, బీసీ(బి)లో ఒక్కో పోస్టుకు 128 మంది, బీసీ(ఈ)లో ఒక్కో పోస్టుకు 41 మంది, బీసీ(సి)లో ఒక్కో పోస్టుకు 40 మంది, బీసీ(ఎ)లో ఒక్కో పోస్టుకు 37 మంది పోటీలో ఉన్నారు. ఎస్సీ కేటగిరీలో ఒక్కో పోస్టుకు 37, ఎస్టీలో ఒక్కో పోస్టుకు 38 శాతం పోటీ పడుతున్నారు.
i) అన్ని రిజర్వ్‌డ్ కేటగిరీల అభ్యర్థులు మెయిన్స్ పరీక్షల్లో వచ్చే మెరిట్ ఆధారంగా ఓసీ కేటగిరీలోని (209) పోస్టుల తుది ఎంపికకు అర్హులవుతారు. స్పోర్ట్ కేటగిరీకి ఇది వర్తించదు.
ii) 5% అన్ రిజర్వ్‌డ్ ఖాళీల కింద, 182 మంది నాన్-లోకల్ తో పాటు 2368 మంది తెలంగాణ అభ్యర్థులు మొత్తం 2550 మంది అభ్యర్థులు షార్ట్‌లిస్ట్ చేయబడ్డారు.
iii) గ్రూప్-I మెయిన్స్‌కు 1:50 ప్రకారం 1299 మంది పర్సన్స్ విత్ డిసేబుల్డ్ కేటగిరీ అభ్యర్థులు ఎంపికయ్యారు. వీరిని సంబంధిత కమ్యూనిటీ కేటగిరీలో చూపించారు.