గ్రూప్-1, 2, 3 పరీక్షల ఫలితాలను మార్చిలో విడుదల చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) సిద్ధమైంది. మార్చి మొదటి వారంలో గ్రూప్-1 మెయిన్స్ జనరల్ ర్యాంకింగ్ జాబితాను ప్రకటించి.. ఆ తర్వాత గ్రూప్-2, ఆపైన గ్రూప్-3 ఫలితాలను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ఒకే అభ్యర్థి రెండు మూడు పోస్టులకు ఎంపికైతే.. ఖాళీలు మిగలకుండా ఉండేందుకు ముందుగా గ్రూప్ 1 నియామక ప్రక్రియ, తర్వాత గ్రూప్ 2, తర్వాత గ్రూప్ 3 ఫలితాలు విడుదలవుతాయి. మొత్తం 5,51,247 మంది అభ్యర్థులు ఈ పోస్టులకు పోటీపడ్డారు. మొత్తం 2741 పోస్టులు ఈ ఫలితాలతో భర్తీ అవుతాయి.
గ్రూప్ 1 లో 563 ఉద్యోగాలకు జూన్ 9న పరీక్ష జరిగింది. 3.02 లక్షల మంది అభ్యర్థులు ప్రిలిమ్స్ హాజరవగా, మెయిన్స్‌కు 31,382 మంది అర్హత సాధించారు. వీరిలో 21,093 మంది మెయిన్స్‌లో అన్ని పరీక్షలు రాశారు. మెయిన్స్ జీఆర్‌ఎల్‌ను ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే విడుదల చేయాలని టీజీపీఎస్సీ భావిస్తోంది.
గ్రూప్ 2 మొత్తం 783 పోస్టులున్నాయి. గత ఏడాది డిసెంబరు 15, 16 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. 2,57,981మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఈ లెక్కన గ్రూప్-2లో మొత్తం 783 పోస్టుల్లో ఒక్కోదానికి 329 మంది పోటీ పడుతున్నారు.
గ్రూప్-3 పరీక్షలు గత ఏడాది నవంబరులో జరిగాయి. మొత్తం 2,72,173 మంది ఈ పరీక్షలు రాశారు. మొత్తం 1,388 పోస్టులున్నాయి.
మార్చిలోనే గ్రూప్ 1, 2, 3 ఫలితాలు
RELATED ARTICLES
PRACTICE TEST
TELANGANA HISTORY
CURRENT AFFAIRS
TELANGANA MAGAZINE
తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.





