పోటీ పరీక్షల ‘కీ’ (సమాధానాల) సమస్యలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) చెక్ పెట్టనుంది. ప్రాథమిక కీ వెలువడినప్పటి నుంచి తుది కీ ఖరారయ్యే నాటికి అభ్యర్థుల్లో ఉన్న సమస్యలు దూరం చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తుంది. ఇక నుంచి ప్రాథమిక కీ విడుదల సమయంలోనే సమాధానాల్లో ప్రాథమిక తప్పులను గుర్తించి వాటిని సరిచేస్తూ సరైన సమాధానాలతో కీ ప్రకటించాలని నిర్ణయించింది. తద్వారా పరీక్ష రాసిన అభ్యర్థులకు ప్రాథమిక కీ సమయంలోనే ఎన్ని మార్కులు వస్తాయి? మెరిట్ సాధిస్తామా? లేదా.. వంటి అంశాలపై ముందే స్పష్టత రానుంది.
ప్రైమరీ కీ… ఫైనల్ కీ లో వ్యత్యాసం
ప్రాథమిక కీ విడుదల చేసేటప్పుడు ప్రశ్నపత్రం రూపొందించిన నిపుణులు చెప్పిన సమాధానాన్ని అందులో పొందుపరిచేవారు. ఆ తరువాత ప్రాథమిక కీపై అభ్యర్థుల నుంచి నిర్ణీత గడువులోగా అభ్యంతరాలను స్వీకరించి పరిశీలించేవారు. ఈ అభ్యంతరాలకు సరైన ఆధారాలు జతచేయాలి. లేకుంటే వాటిని పరిగణనలోకి తీసుకోరు. ఈ తరహా విధానంతో అభ్యర్థుల్లో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొనేవి. ప్రాథమిక కీ నాటికి వస్తున్న మార్కులకు.. తుది కీ నాటికి వస్తున్న మార్కులకు వ్యత్యాసం కనిపిస్తుండేది. కొన్ని సందర్భాల్లో ఒక్క మార్కు తేడాతో ర్యాంకుల్లో చాలా వెనుకబాటు కనిపిస్తోంది. దీంతో మార్కులు తగ్గాయన్న ఆందోళన అభ్యర్థుల్లో నెలకొంటోంది. గతంలో కొన్ని సందర్భాల్లో న్యాయ వివాదాలు తలెత్తి నియామక ప్రక్రియ ఆలస్యమైంది.
గ్రూప్ 4 లో పది.. గ్రూప్ 1 లో ఎనిమిది ప్రశ్నలు తొలగింపు
Nice