HomeJOBSనిరుద్యోగులకు గుడ్ న్యూస్..290 పోస్టులకు టీజీపీఎస్సీ నోటిఫికేషన్

నిరుద్యోగులకు గుడ్ న్యూస్..290 పోస్టులకు టీజీపీఎస్సీ నోటిఫికేషన్

ఇంజనీరింగ్ అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గుడ్ న్యూస్ చెప్పింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న మొత్తం 290 అసిస్టెంట్ ఇంజనీర్ స్థాయి పోస్టుల భర్తీ కోసం మూడు వేర్వేరు నోటిఫికేషన్లను విడుదల చేసింది. రోడ్లు, భవనాల (R&B) శాఖతో పాటు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో ఈ నియామకాలు జరగనున్నాయి. ప్రభుత్వ రంగంలో స్థిరపడాలనుకునే నిరుద్యోగ యువతకు, ముఖ్యంగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గరిష్ట వయోపరిమితిని పెంచిన నేపథ్యంలో.. ఈ నోటిఫికేషన్లు ఒక అద్భుతమైన అవకాశంగా నిలవనున్నాయి.

పోస్టుల వివరాలు, విభాగాలు:
ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 290 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో రోడ్లు, భవనాల (R&B) శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్) పోస్టులు 215, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) పోస్టులు 56 ఉన్నాయి. వీటితో పాటు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (PCB) లో 19 అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

విద్యార్హతలు:
AEE (సివిల్):
సివిల్ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్ లేదా AMIE అర్హత కలిగి ఉండాలి.

AEE (ఎలక్ట్రికల్): ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్: సివిల్, కెమికల్, బయోటెక్నాలజీ, మైనింగ్, లేదా ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా సంబంధిత పీజీ అర్హత ఉండాలి.

వయోపరిమితి:
అభ్యర్థుల వయస్సు జులై 1 నాటికి 18 నుంచి 46 సంవత్సరాల మధ్య ఉండాలి. అదనంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వయోసడలింపు వర్తిస్తుంది.

జీతం:
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 54,220 నుంచి రూ. 1,33,630 వరకు జీతం లభిస్తుంది.

ముఖ్యమైన తేదీలు:
ఈ పోస్టులకు కేవలం ఆన్‌లైన్ ద్వారానే అప్లై చేసుకోవాలి.

సివిల్ పోస్టులు: జూన్ 6 నుంచి జులై 11 వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

ఎలక్ట్రికల్ పోస్టులు: జూన్ 8 నుంచి జులై 15 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్: జూన్ 10 నుంచి జులై 17 వరకు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

పరీక్షల నిర్వహణ:
ఈ పరీక్షలను ఆన్‌లైన్ (CBRT) విధానంలో నిర్వహిస్తారు. సివిల్, ఎలక్ట్రికల్ AEE పరీక్షలను అక్టోబర్ 2026 లో, అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పరీక్షను సెప్టెంబర్ 2026 లో TGPSC నిర్వహించనుంది.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here