HomeADMISSIONSతెలంగాణ పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!

తెలంగాణ పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!

రాష్ట్రంలోని పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. హైదరాబాద్‌లోని నాంపల్లి విద్యా భవన్‌లో జరిగిన అడ్మిషన్ కమిటీ సమావేశంలో కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను అధికారికంగా ఖరారు చేశారు. ఈ నేపథ్యంలోనే 2026 విద్యాసంవత్సరానికి గాను ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో సీట్ల భర్తీకి సంబంధించిన ఫేజ్-1, ఇంటర్నల్ స్లైడింగ్ ,స్పాట్ అడ్మిషన్ల పూర్తి వివరాలను ప్రకటించారు.

TGPOLYCET-2026 కౌన్సెలింగ్ ప్రక్రియ:

మొదటి విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ (First Phase):
ఇంజనీరింగ్, నాన్-ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సుల్లో చేరడానికి మొదటి విడత ప్రక్రియ మే నెలాఖరు నుంచి ప్రారంభమవుతుంది.

1.ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు & స్లాట్ బుకింగ్: మే 27 నుంచి మే 31 వరకు.

అభ్యర్థులు వెబ్‌సైట్‌లో అవసరం అయిన వివరాలు ఎంటర్ చేసి, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం తమకు నచ్చిన హెల్ప్ లైన్ సెంటర్ (HLC), తేదీ, సమయాన్ని బుక్ చేసుకోవాలి.

2.డాక్యుమెంట్ వెరిఫికేషన్: మే 29నుంచి జూన్ 1 వరకు.

ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థులు హెల్ప్ లైన్ కేంద్రాలకు వెళ్లి ఒరిజినల్ సర్టిఫికేట్లను వెరిఫై చేయించుకోవాలి.

3.వెబ్ ఆప్షన్లు: మే 29 నుంచి జూన్ 3 వరకు.
సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన వారు తమకు నచ్చిన కాలేజీలు, కోర్సులను ప్రాధాన్యత క్రమంలో వెబ్‌సైట్‌లో ఎంచుకోవాలి.

  1. ఆప్షన్ల ఫ్రీజింగ్: జూన్ 03.

అభ్యర్థులు ఎంచుకున్న ఆప్షన్లను మార్చుకోవడానికి ఇది ఆఖరి రోజు. ఈ రోజుతో ఆప్షన్లు లాక్ అయిపోతాయి.

  1. తాత్కాలిక సీట్ల కేటాయింపు: జూన్ 6న లేదా అంతకంటే ముందే.

మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా విద్యార్థులకు ఏ కాలేజీలో సీటు వచ్చిందో వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు.

  1. ఫీజు చెల్లింపు & ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్: జూన్ 6 నుంచి జూన్ 09 వరకు.

సీటు పొందిన అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా ట్యూషన్ ఫీజు చెల్లించి, ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి.

7.సెల్ఫ్ రిపోర్ట్ చేయడం: జూన్ 8,9.

అలాట్‌మెంట్ ఆర్డర్, ఫీజు రసీదులతో విద్యార్థులు తమకు కేటాయించిన కాలేజీకి వెళ్లి అడ్మిషన్ ఖరారు చేసుకోవాలి.

కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం: జూన్ 9 నుంచి తరగతులు మొదలవుతాయి.

ఓరియంటేషన్ క్లాసులు: జూన్ 9, 10 తేదీల్లో కొత్తగా చేరిన అభ్యర్థులకు కాలేజీ వాతావరణం, కోర్సులపై అవగాహన సదస్సులు నిర్వహిస్తారు.

  1. చివరి విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ (Final Phase):
    మొదటి విడతలో సీటు రాని వారు లేదా అసలు పాల్గొనని వారి కోసం జూన్ మధ్యలో చివరి విడత కౌన్సెలింగ్ జరుగుతుంది.

చివరి విడత రిజిస్ట్రేషన్ & స్లాట్ బుకింగ్:

జూన్ 15 (మొదటి విడతలో పాల్గొనని వారు మాత్రమే ఈ రోజు ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవాలి).

చివరి విడత సర్టిఫికేట్ వెరిఫికేషన్:

జూన్ 16 న స్లాట్ బుక్ చేసుకున్న వారికి సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగుతుంది.

వెబ్ ఆప్షన్ల నమోదు:

జూన్ 16, 17తేదీల్లో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు.

ఆప్షన్ల ఫ్రీజింగ్: జూన్ 17 న ఆప్షన్లు లాక్ అవుతాయి.

చివరి విడత సీట్ల కేటాయింపు: జూన్ 20 లేదా అంతకంటే ముందే సీట్లు కేటాయిస్తారు.

ఫీజు చెల్లింపు & ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్: జూన్ 20 నుంచి జూన్ 22 వరకు ఆన్‌లైన్‌లో ఫీజు కట్టి రిపోర్ట్ చేయాలి.

కాలేజీలో స్వయంగా రిపోర్ట్ చేయడం: జూన్ 22, 23 తేదీల్లో కేటాయించిన కాలేజీకి వెళ్లి జాయిన్ అవ్వాలి.

కాలేజీల అప్‌డేట్: జూన్ 24 లోగా చేరిన అభ్యర్థుల వివరాలను కాలేజీ యాజమాన్యాలు కన్వీనర్ కోటాలో ఆన్‌లైన్ ద్వారా అప్‌డేట్ చేయాలి.

  1. ఇంటర్నల్ స్లైడింగ్ , స్పాట్ అడ్మిషన్లు (Internal Sliding & Spot Admissions):
    కౌన్సెలింగ్ ప్రక్రియలన్నీ ముగిసిన తర్వాత అంతర్గత మార్పులు, మిగిలిన సీట్ల భర్తీకి ఈ విడత ఉపయోగపడుతుంది.

సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ (అంతర్గత బ్రాంచ్ మార్పు):
ఇది ఇప్పటికే ఒక కాలేజీలో సీటు పొంది చేరిన విద్యార్థులు, అదే కాలేజీలో ఖాళీగా ఉన్న వేరే బ్రాంచ్ (కోర్సు) కి మారే ప్రక్రియ. దీనికి కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫీజ్ రీయింబర్స్‌మెంట్ వర్తిస్తుంది.

స్లైడింగ్ ఆప్షన్ల నమోదు: జూన్ 27,28 తేదీల్లో ఆన్‌లైన్‌లో ఆప్షన్లు ఇచ్చుకోవాలి.

సీట్ల కేటాయింపు: జూన్ 30 న లేదా అంతకంటే ముందే కొత్త బ్రాంచ్ సీటును ఖరారు చేస్తారు.

కొత్త బ్రాంచ్‌లో రిపోర్టింగ్: జులై 1 న అభ్యర్థులు కొత్త అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకుని, తమ కాలేజీలోనే కొత్తగా వచ్చిన బ్రాంచ్‌లో చేరాలి.

స్పాట్ అడ్మిషన్లు (Spot Admissions):
కౌన్సెలింగ్ అంతా అయిపోయాక ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో మిగిలిపోయిన సీట్లను డైరెక్ట్‌గా భర్తీ చేసే ప్రక్రియ.

మార్గదర్శకాల విడుదల: జులై 1న స్పాట్ అడ్మిషన్ల గైడ్‌లైన్స్‌ను అధికారిక వెబ్‌సైట్ https://tgpolycet.nic.in లో ఉంచుతారు. కాలేజీల ప్రిన్సిపాళ్లు దీని ప్రకారం సీట్లు భర్తీ చేస్తారు.

స్పాట్ అడ్మిషన్ల ముగింపు: జులై 08 నాటికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాలిటెక్నిక్ కాలేజీలలో స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తవుతుంది.

నోటిఫికేషన్, హెల్ప్ లైన్ కేంద్రాల లిస్ట్, కోర్సుల వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ tgpolycet.nic.in ను సందర్శించాలని కన్వీనర్ తెలిపారు.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here