తెలంగాణ టెట్-2024 ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి తన నివాసంలో టెట్ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది పరీక్షకు 2,86,381 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పేపర్-1పరీక్షకు 85,996 అభ్యర్థులు హాజరుకాగా.. 57,725 అభ్యర్థులు అర్హత సాధించారు. పేపర్-2 పరీక్షకు 1,50,491 అభ్యర్థులు హాజరుకాగా.. 51,443 అభ్యర్థులు అర్హత సాధించారు. ఫలితాల డైరెక్ట్ లింక్ ఇక్కడ అందుబాటులో ఉంది.
పేపర్-1లో అర్హత సాధించిన వారు 67.13%
పేపర్-2లో అర్హత సాధించిన వారు 34.18%
వచ్చే టెట్‌కు ఫీజు లేదు
2023తో పోలిస్తే ఈసారి పేపర్-1లో 30.24% అర్హత శాతం పెరిగింది. పేపర్-2లో 18.88% అర్హత శాతం పెరిగింది. టెట్ దరఖాస్తుల సమయంలో ఎన్నికల కోడ్ కారణంగా టెట్ దరఖాస్తు ఫీజు తగ్గింపు నిర్ణయాన్ని ఎన్నికల కమిషన్ అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో దరఖాస్తు దారులకు ఉపశమనం కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెట్-2024లో అర్హత సాధించని దరఖాస్తుదారులకు వచ్చే టెట్ కు ఉచితంగా దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. టెట్-2024లో అర్హత సాధించిన వారికి ఒకసారి ఉచితంగా డీఎస్సీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.