తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ జూన్ సెషన్ హాల్ టికెట్లు అధికారికంగా విడుదలయ్యాయి. టెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్ నుంచి తమ అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆధార్ నంబర్, జర్నల్ నంబర్, మొబైల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి హాల్ టికెట్‌ను పొందవచ్చు.
షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 16 నుంచి 22వరకు ఐదు రోజుల పాటు రోజుకు రెండు విడతలుగా ఈ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత విధానంలో (CBT) జరగనున్నాయి. మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 గంటల వరకు నిర్వహిస్తారు. పేపర్-1, పేపర్-2 కలిపి మొత్తం 1.37 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు.
పరీక్షల నిర్వహణ కోసం తెలంగాణలోని మొత్తం 16 జిల్లాల్లో 61 పరీక్షా కేంద్రాలను అధికారులు సర్వం సిద్ధం చేశారు. హాల్ టికెట్లతో పాటు అభ్యర్థుల సౌకర్యార్థం అధికారిక వెబ్‌సైట్‌లో మాక్ టెస్టులు కూడా అందుబాటులో ఉంచారు.
హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకునే విధానం:
- ముందుగా అధికారిక వెబ్ సైట్ tgtet.aptonline.in ఓపెన్ చేయండి.
- హోమ్ పేజీలో కనిపించే “Hall Ticket Download” లింక్ పై క్లిక్ చేయండి.
- మీ లాగిన్ వివరాలు ( ఆధార్ నంబర్, జర్నల్ నెంబర్, పుట్టిన తేదీ) ఎంటర్ చేయండి.
- తర్వాత సబ్మిట్ (Submit) బటన్ క్లిక్ చేయగానే హాల్‌టికెట్ స్క్రీన్ పై కనిపిస్తుంది. డౌన్‌లోడ్ చేసుకోండి.





