HomeLATESTతెలంగాణ TG TET-జూన్ 2026 నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ TG TET-జూన్ 2026 నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ ప్రభుత్వం స్కూల్ ఎడ్యుకేషన్ విభాగం TG TET-జూన్ 2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. టీచర్ ఉద్యోగాల కోసం అర్హత పొందాలనుకునే అభ్యర్థులకు ఇది కీలక అవకాశం. ఈ పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా కంప్యూటర్ ఆధారిత విధానంలో (CBT) నిర్వహించనున్నారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఏప్రిల్ 15, 2026 నుంచి ఏప్రిల్ 30, 2026 వరకు ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. నోటిఫికేషన్, ఇన్ఫర్మేషన్ బులెటిన్ వంటి పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో ఏప్రిల్ 15 నుంచి అందుబాటులో ఉంటాయి. హాల్ టికెట్లు జూన్ 9 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు
నోటిఫికేషన్ విడుదల తేదీ 11-04-2026
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం 15-04-2026
ఆన్‌లైన్ దరఖాస్తుల చివరి తేదీ 30-04-2026
హాల్ టికెట్లు డౌన్‌లోడ్ 09-06-2026 నుంచి
పరీక్ష తేదీలు 15-06-2026 నుంచి 30-06-2026 వరకు
ఫలితాల ప్రకటన 27-07-2026

ఈ పరీక్షను జూన్ 15 నుంచి జూన్ 30, 2026 వరకు నిర్వహించనున్నారు. రోజుకు రెండు సెషన్లలో పరీక్ష జరుగుతుంది. ఉదయం 9.00 నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 2.00 నుంచి 4.30 వరకు పరీక్ష సమయం ఉంటుంది.

TG TET పరీక్ష పేపర్-1 మరియు పేపర్-2 రూపంలో ఉంటుంది. 1 నుంచి 5వ తరగతులకు బోధించాలనుకునేవారు పేపర్-1, 6 నుంచి 8వ తరగతులకు బోధించాలనుకునేవారు పేపర్-2 రాయాలి. రెండు స్థాయిలకు అర్హత ఉన్నవారు రెండు పేపర్లకూ హాజరుకావచ్చు. అర్హతల విషయానికి వస్తే, D.El.Ed, D.Ed, B.Ed, లాంగ్వేజ్ పండిట్ లేదా సమాన అర్హతలు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫైనల్ ఇయర్‌లో ఉన్నవారికి కూడా అవకాశం ఉంది. గతంలో TET అర్హత పొందినవారు తమ స్కోర్ మెరుగుపర్చుకోవడానికి మళ్లీ పరీక్ష రాయవచ్చు.

ముఖ్యాంశాలు
పరీక్ష విధానం కంప్యూటర్ ఆధారిత పరీక్ష (Computer Based Test – CBT)
పరీక్ష పేపర్లు పేపర్-I, పేపర్-II
పేపర్-I అర్హత 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు బోధించాలనుకునే వారికి
పేపర్-II అర్హత 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధించాలనుకునే వారికి
రెండు పేపర్లకు అవకాశం 1 నుంచి 8వ తరగతి వరకు బోధించాలనుకునే వారు పేపర్-I మరియు పేపర్-II రెండూ రాయవచ్చు
ప్రశ్నల రకం ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు (MCQs)
ప్రతి పేపర్‌లో ప్రశ్నలు 150 ప్రశ్నలు
ప్రతి పేపర్‌కు మార్కులు 150 మార్కులు
పరీక్ష వ్యవధి 2 గంటలు 30 నిమిషాలు
నెగెటివ్ మార్కింగ్ లేదు

పరీక్ష ఫీజు జనరల్ మరియు BC అభ్యర్థులకు ఒక పేపర్‌కు ₹750, రెండు పేపర్లకు ₹1000గా నిర్ణయించారు. SC, ST, దివ్యాంగ అభ్యర్థులకు ఒక పేపర్‌కు ₹700, రెండు పేపర్లకు ₹950గా ఉంటుంది. ఫీజు చెల్లింపు కూడా ఆన్‌లైన్‌లోనే చేయాలి. పాస్ మార్కులు జనరల్/EWSకు 60%, BCలకు 50%, SC/ST/దివ్యాంగులకు 40%గా నిర్ణయించారు. TG TET అర్హత సర్టిఫికేట్ జీవితకాలం వర్తిస్తుంది. అలాగే టీచర్ నియామక పరీక్షల్లో TET స్కోర్‌కు 20% వెయిటేజ్ ఇవ్వనున్నారు.

పరీక్ష సిలబస్​
విభాగం ప్రశ్నలు మార్కులు
శిశు వికాసం మరియు పెడగాజి 30 30
భాష-I 30 30
భాష-II (ఇంగ్లీష్) 30 30
గణితం మరియు సైన్స్
లేదా
సామాజిక అధ్యయనాలు / ఇతరులు
60 60
మొత్తం 150 150

తెలంగాణలో టీచర్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. పూర్తి వివరాలు తెలుసుకుని సమయానికి దరఖాస్తు చేసుకోవాలి.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here