టీజీ టెట్ ఇన్-సర్వీస్ టీచర్స్-2026 ఆన్లైన్ పరీక్షల షెడ్యూల్ను పాఠశాల విద్యాశాఖ అధికారికంగా విడుదల చేసింది. సెప్టెంబర్ 8, 9 తేదీల్లో ఈ పరీక్షలు అత్యంత పకడ్బందీగా జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 24,983 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. విద్యాశాఖ రోజుకు 3 షిఫ్టులో పరీక్షలు నిర్వహించనుంది. ఇదిలా ఉంటే.. ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు, అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 వరకు పరీక్షలు కొనసాగుతాయి. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 8న పేపర్-1, పేపర్-2 (తెలుగు, ఇంగ్లీష్ మీడియం) పరీక్షలు, సెప్టెంబర్ 9న మిగిలిన వివిధ మీడియంల పేపర్-2 పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షా కేంద్రాలు, హాల్ టికెట్లు ,ఇతర వివరాల కోసం schooledu.telangana.gov.in అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు.






