జనవరి 03 నుంచి 20 వరకు విద్యాశాఖ నిర్ణయించిన తేదీల్లో తెలంగాణ టెట్ పరీక్షలు జరగనున్నాయి. సుమారు 2.5 లక్షల మంది హాజరయ్యే ఈ పరీక్షకు ఈ సారి కొత్తగా పరీక్ష రాసే వారే అధికంగా ఉన్నారు. సర్వీస్ లో ఉన్న టీచర్లు సుమారు 70వేలకు పైగా ఉన్నారు. వీరందరి కోసం టెట్ పరీక్ష వెళ్లే మందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీకోసం అందిస్తున్నాం.
- టెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న వారు ముందుగా వెబ్ సైట్ లో టెట్ హాల్ టికెట్ ను డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి. దీనితో పాటు ఒక ఫొటో గుర్తింపు కార్డును వెంట తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది.
- ఉపాధ్యాయులు అయితే టీచర్ ఐడెంటీటీ కార్డును కూడా తీసుకెళ్లాలి.
- చాలా మందికి పరీక్ష కేంద్రాలు ఆప్షన్ ఇచ్చిన దానికి బదులు ఇతర జిల్లాల్లో సెంటర్లను కేటాయించారు. కావున గూగూల్ మ్యాప్స్ సహాయంతో మీకు కేటాయించిన సెంటర్ ను ముందే చెక్ చేసుకి వెళ్లడం మంచింది.
- మీరున్న ప్రాంతానికి 100 కి.మీ పైగా సెంటర్ కేటాయిస్తే.. ఒక రోజు ముందే సెంటర్ ఉన్న సమీప ప్రాంతానికి చేరుకునే ఏర్పాట్లు చేసుకోవాలి. పరీక్ష కేంద్రానికి సుమారు 2 గంటల ముందే చేరుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండొచ్చు.
- కంప్యూటర్ బేస్డ్ పరీక్ష ఉంటుంది. కాబట్టి స్త్కీన్ గ్లాస్ అవసరమైన వారు వెంట తీసుకెళ్లండి. పెన్నులు బ్లూ లేదా బ్లాక్ పాయింట్ పెన్నులు తీసుకెళ్లండి.
- ఎలక్ట్రానిక్ వస్తులు, మొబైల్ ఫోన్లు సెంటర్ లోపలికి అనుమతి ఉండదు. ఎలాంటి డిపాజిట్ కౌంటర్లు ఏర్పాటు చేయరు. దీనిని అభ్యర్థులు వెసులుబాటు చేసుకోవాలి.
- పరీక్షా కేంద్రంలో ప్రతి అభ్యర్థికి బయోమెట్రిక్ వేలిముద్రలు తీసుకుంటారు. కాబట్టి అభ్యర్థులు ముఖ్యంగా మహిళలు చేతులకు మెహందీ పెట్టుకోవద్దు. దీనివల్ల బయోమెట్రిక్ సరిగ్గా పడక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
- కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి అభ్యర్థులు ఎలాంటి ఆందోళన చెందవద్దు, కంప్యూటర్ వాడకం తెలియని వారు అక్కడ ఉండే ఇన్విజిలేటర్ల సహాయం కోరవచ్చు.
- కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ పై అవగాహన లేని వారుhttps://merupulu.com/ వెబ్ సైట్ ద్వారా గ్రాండ్ టెస్టులను ప్రాక్టీస్ చేసి అవగాహన పెంచుకోవచ్చు.
- పరీక్షా సమయం ముగియగానే స్క్రీన్ ఆటోమేటిక్‌గా లాక్ అవుతుంది. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.





